Vaishnav Tej: వైష్ణవ్ తేజ్ సినిమాలు అందుకే ఫ్లాప్ అవుతున్నాయా?
September 5, 2022 / 10:31 AM IST
|Follow Us
టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన వైష్ణవ్ తేజ్ నటించిన రంగ రంగ వైభవంగా సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోగా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదనే సంగతి తెలిసిందే. గిరీశాయ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిలైంది. ఈ సినిమా గతంలో విడుదలైన చాలా హిట్ సినిమాలను గుర్తు చేసిందని అయితే ప్రేక్షకులకు నచ్చే కథ, కథనం ఈ సినిమాలో లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి.
తొలి సినిమా ఉప్పెనతో ఊహించని స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్ కు కొండపొలం షాక్ ఇవ్వగా రంగ రంగ వైభవంగా అంతకు మించిన షాక్ ఇచ్చింది. ఈతరం ప్రేక్షకులకు నచ్చే కథలను వైష్ణవ్ తేజ్ ఎంపిక చేసుకుంటే అతని కెరీర్ బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైష్ణవ్ తేజ్ చిరంజీవి సలహాలు తీసుకుంటే బెటర్ అని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. సినిమాలకు సంబంధించి చిరంజీవి జడ్జిమెంట్ మెజారిటీ సందర్బాలలో కరెక్ట్ అవుతుంది.
రామ్ చరణ్ కథల ఎంపికలో కూడా చిరంజీవిదే తుది నిర్ణయమని సమాచారం. చిరంజీవి సలహాతోనే ఉప్పెన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ సినిమాతో వైష్ణవ్ తేజ్ సక్సెస్ అందుకున్నారు. సరైన కథలను ఎంచుకుంటే మాత్రమే వైష్ణవ్ తేజ్ కెరీర్ కు మేలు జరుగుతుందని చెప్పవచ్చు. కథల ఎంపికలో పొరపాట్లు చేస్తే వైష్ణవ్ తేజ్ నష్టపోవాల్సి ఉంటుంది. వైష్ణవ్ తేజ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇప్పటికే వైష్ణవ్ తేజ్ ఖాతాలో రెండు ఫ్లాపులు చేరడంతో తర్వాత సినిమాతో వైష్ణవ్ తేజ్ సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది. బ్యాగ్రౌండ్ ఉన్నా ఎంతోమంది హీరోలు కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు. వైష్ణవ్ తేజ్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన తరుణం ఆసన్నమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి.