నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా.. ఆ సినిమానే బెటర్.. మిగిలిన రెండూ కష్టమే..!

  • September 29, 2023 / 06:45 PM IST

‘స్కంద’ ‘చంద్రముఖి 2’ .. ఈ రెండూ కూడా వినాయక చవితికి రిలీజ్ కావాల్సిన సినిమాలు..! కానీ కొన్ని కారణాల వల్ల అవి సెప్టెంబర్ 28 కి వచ్చి చేరాయి. ఇక ఆగస్టు 18న రిలీజ్ అనుకున్న ‘పెదకాపు 1’ సెప్టెంబర్ 29 కి వచ్చింది. ఇవి మూడు క్రేజీ సినిమాలే..! కానీ ప్రమోషనల్ కంటెంట్ తో ఎక్కువ బజ్ క్రియేట్ చేసిన సినిమా ‘పెద కాపు 1’ అని చెప్పాలి. కేవలం మౌత్ టాక్ పై ఆధారపడి రిలీజ్ అయిన సినిమాలుగా ‘స్కంద’ ‘చంద్రముఖి 2’..లని చెప్పుకోవచ్చు. !సరే ఈ మూడు సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించిన సినిమా ఏది? ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద బాగా క్యాష్ చేసుకునే సినిమా ఏది.. అంటే..!

కచ్చితంగా ‘స్కంద’ కే  (Skanda)  ఎక్కువ ఛాన్స్ ఉంది. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. బోయపాటి శ్రీను గత సినిమాలకి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది ఏమీ లేదు. అయినా అవి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేశాయి. ఈసారి కూడా అదే రిపీట్ అవ్వొచ్చు. మొదటి రోజే ఈ చిత్రానికి రామ్ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ నమోదయ్యాయి. రెండో రోజు కూడా మాస్ ఏరియాల్లో బుకింగ్స్ బాగున్నాయి. సో శని, ఆదివారాలతో పాటు సోమవారం గాంధీ జయంతి హాలిడే కూడా ఉంది కాబట్టి.. ఈ మూవీ 80 శాతం రికవరీ సాధించే అవకాశాలు ఉన్నాయి.

ఇక ‘పెదకాపు 1’ విషయానికి వస్తే.. టీజర్, ట్రైలర్స్ రేంజ్లో అయితే సినిమా లేదు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ పోర్షన్ తప్ప.. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోదు. సో బాక్సాఫీస్ వద్ద పెద్దగా అద్భుతాలు చేసే అవకాశం లేదు.

అలాగే ‘చంద్రముఖి 2’ విషయానికి వస్తే.. ఇందులో ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా ఆకట్టుకునే విధంగా లేదు. ‘చంద్రముఖి’ క్రేజ్ వల్ల.. హాలిడే వల్ల మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రావొచ్చేమో కానీ రెండో రోజు డల్ అయినట్టే కనిపిస్తుంది..!

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus