Chiranjeevi: మెగాస్టార్ రెమ్యునరేషన్ వార్తల్లో అసలు నిజమిదేనా.. ఏమైందంటే?
December 6, 2023 / 04:43 PM IST
|Follow Us
టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా ఊహించని స్థాయిలో సక్సెస్ అయిన హీరోలలో చిరంజీవి ఒకరు కాగా మెగాస్టార్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ఒక్కో సినిమాకు 65 కోట్ల రూపాయల నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారని రెమ్యునరేషన్ వల్ల మెగాస్టార్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వినిపిస్తోంది. అయితే చిరంజీవి గురించి తెలిసిన వాళ్లు మాత్రం వైరల్ అవుతున్న వార్తలను నమ్మడం లేదు.
చిరంజీవి కథ, కథనంకు ప్రాధాన్యత ఇస్తారని రెమ్యునరేషన్ విషయంలో పట్టింపులకు పోరని వాళ్లు చెబుతున్నారు. తన మార్కెట్ కు అనుగుణంగా చిరంజీవి పారితోషికం తీసుకుంటారని వాళ్లు చెబుతున్నారు. చిరంజీవి గురించి ఎవరో కావాలని ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మెగాస్టార్ రెమ్యునరేషన్ 55 కోట్ల రూపాయలుగా ఉందని సమాచారం అందుతోంది.
రీఎంట్రీలో చిరంజీవి (Chiranjeevi) నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నాయి. చిరంజీవి త్వరలో విశ్వంభర సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఏకంగా 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
మల్లిడి వశిష్ట రెండో సినిమానే కళ్లు చెదిరే బడ్జెట్ తో తెరకెక్కుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ సినిమా కోసం భారీ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారు. మల్లిడి వశిష్ట తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ సాధించి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ మూవీ ఉండనుందని తెలుస్తోంది.