Balakrishna: ఆ రెండు మార్పులు చేసుంటే బాలయ్య ‘అధినాయకుడు’ సూపర్ హిట్ అయ్యేది!
March 1, 2023 / 03:00 PM IST
|Follow Us
నటసింహ నందమూరి బాలకృష్ణ చాలా కాలం తర్వాత ‘సింహా’ తో జూలు విదిలించి.. సరైన సినిమా పడితే తన స్టామినా ఏంటనేది చూపించాడు.. వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న బాలయ్య బాబుకి సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఆకలిగొన్న సింహం వేటాడినట్టు బాక్సాఫీస్ బరిలో కలెక్షన్ల వేట కొనసాగించి.. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు బాలయ్య.. దాంతో వరుసగా సినిమాలు క్యూ కట్టాయి.. వాటిలో దర్శకరత్న దాసరితో ప్రకటించిన ‘పరమవీర చక్ర’.. దాని తర్వాత ‘ఆంధ్రుడు’, ‘పెదబాబు’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న పరుచూరి మురళి దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించారు..
2010 సెప్టెంబర్‌లో రామా నాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు.. డి. సురేష్ బాబు చేతుల మీదుగా పూజ జరిగింది.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బాలయ్యపై క్లాప్ నివ్వగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త రఘు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు.. బాలయ్య ఇమేజ్‌కి తగ్గ కథ, కథనాలతో, టాలెంటెడ్ టెక్నీషియన్లతో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు.. వివిధ కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమవుతుండడంతో మెల్లగా ఆసక్తి తగ్గిపోయింది..
దీనికి నిర్మాత ఎమ్.ఎల్. కుమార్ చౌదరే కారణం అంటుంటారు.. అనుకున్న సమయానికంటే చాలా ఆలస్యంగా విడుదల చేశారు.. బాలయ్య.. తాత, తండ్రి, కొడుకు.. మూడు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించాడు.. ఓపెనింగ్‌లోనే పెద్ద క్యారెక్టర్ని చంపేసి హైప్ క్రియేట్ చేశారు.. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో కొడుకు పాత్ర ఎంటర్ అవడంతో సెకండ్ హాఫ్ మీద అంచనాలు పెరిగాయి.. రాయలసీమ నేపథ్యంలో వచ్చే తాత పాత్ర ఫ్లాష్ బ్యాక్ బాగుంటుంది..
బాలయ్య బాడీ లాంగ్వేజ్, సీమ యాసలో డైలాగ్స్, గెటప్ ఆకట్టుకుంటాయి.. అయితే ‘అధినాయకుడు’ అంచనాలను అందుకోలేక పోయింది.. కథ మరింత పకడ్బందీగా ఉంటే బాగుండేందని.. అలాగే బాలయ్య చేత తండ్రి, కొడుకు పాత్రలు వేయించి.. మనవడి క్యారెక్టర్ ఎవరైనా యంగ్ హీరోతో చేయిస్తే వేరే లెవల్లో ఉండేదని.. సాగదీత స్క్రీన్ ప్లే, అనవసరపు లవ్, కామెడీ ట్రాక్ వంటివి ట్రిమ్ చేసుంటే సినిమా సూపర్ హిట్ అయ్యిండేదనే కామెంట్స్ బహిరంగంగానే వినిపించాయి..