Anchor Ravi: రవి ఎలిమినేషన్ కి ఓట్లు పడకపోవడమే కారణమా..? ఇంకేమన్నా మతలబు ఉందా..?
November 28, 2021 / 05:18 PM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లో నుంచి అనూహ్యంగా యాంకర్ రవి ఎలిమినేట్ అయిపోయాడు. ఇది రవి ఫ్యాన్స్ నే కాకుండా బిగ్ బాస్ వ్యూవర్స్ ని సైతం షాక్ కి గురి చేసింది. అన్ అఫీషియల్ పోలింగ్స్ లో అన్ని సైట్స్ లోనూ సేఫ్ జోన్ లో ఉన్న రవి ఎలా ఎలిమినేట్ అవుతాడు అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా అన్ ఫెయిర్ అని గ్రూప్స్ లో బిగ్ బాస్ షో నిర్వాహకులపై ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. అసలు నిజంగా రవికి తక్కువ ఓట్లు వచ్చే ఎలిమినేట్ అయ్యాడా..? లేదా వేరే ఏదైనా రీజన్స్ తో రవిని పంపించేశారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి రవి గేమ్ ఒక్కసారి చూసినట్లయితే, ఈసీజన్ కి వన్ ఆఫ్ ద హైలెట్ పార్టిసిపెంట్ రవినే అని చెప్పాలి. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగాడు. ముఖ్యంగా నాలుగైదు వారాలు రవి గ్రాఫ్ ఒక రేంజ్ లో పెరిగింది. టాస్క్ లలో తన పెర్ఫామెన్స్ తోనే ఆడియన్స్ కి బాగా క్లోజ్ అయ్యాడు. ముఖ్యంగా “రాజా” టాస్క్, “అమెరికా అబ్బాయి – హైదరాబాద్ అమ్మాయిల” టాస్క్, బిబి హోటల్ టాస్క్ లలో దూసుకుని ముందుకు వెళ్లాడు. తన పెర్ఫామెన్స్ తో ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు.
విలన్స్ వర్సెస్ హీరోస్ టాస్క్ లలో తనకి వచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించి తన హీరోయిజాన్ని చూపించుకున్నాడు. హౌస్ మేట్స్ అందరూ కలిసి టార్గెట్ చేస్తున్నా కూడా ఓపిగ్గా ఉన్నాడు రవి. అంతేకాదు, గుంటనక్క, ఇన్ఫులెన్స్ స్టార్ అంటూ తోటి హౌస్ మేట్స్ అంటున్నా కూడా వారిపై ఎప్పుడూ కోపానికి వెళ్లలేదు. తన కోపాన్ని, చిరాకుని ఎవరిపైనా ప్రదర్శించలేదు. తను నామినేషన్స్ లో ఉన్నా, లేదా తను ఎవరినైనా నామినేట్ చేసినా ఆ తర్వాత టాస్క్ లో కలిసి ఆడేందుకు వీలుగా దగ్గరకి వెళ్లి ప్యాచ్ అప్ చేస్కున్నాడు.
ఇంత గొప్పగా గేమ్ తోనే ఆకర్షిస్తున్న రవికి యాంకర్ గా కూడా సపరేట్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఎన్ని వారాలు నామినేషన్స్ లోకి వచ్చినా సేఫ్ అవుతూనే వచ్చాడు. అలాంటిది ఇప్పుడు తనకంటే వీక్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నా కూడా వాళ్లు కాకుండా రవిని ఎందుకు ఎలిమినేట్ చేశారు అనేది బిగ్ బాస్ టీమ్ కే తెలియాలి. ఇలా చేస్తే తర్వాత సీజన్స్ లో బిగ్ బాస్ కి వెళ్లేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తారా..? లేదా సోషల్ మీడియాలో ఈ రియాలిటీ షోకి ఇంత క్రేజ్ వస్తుందా ? బిగ్ బాస్ ఎలిమినేషన్స్ లో ఫెయిర్ లేకపోతే షోకి టీఆర్పీలు వస్తాయా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పుడు బిగ్ బాస్ వ్యూవర్స్ కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియా సాక్షిగా ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు రవి ఫ్యాన్ గ్రూప్స్ లో కూడా ఇది చాలా అన్ ఫెయిర్ అంటూ ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. నిజానికి ఈవారం రవితో పాటుగా సిరి, కాజల్, పింకీలు కూడా నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్లకి రవి కంటే ఎక్కువ ఓట్లు వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే , గడిచిన వారాల్లో వీళ్లందరూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నవాళ్లే. అప్పుడు రవి కూడా నామినేషన్స్ లో ఉన్నాడు. ఆ లెక్కన చూసుకున్నా కూడా రవి ఈసారి ఈజీగా సేఫ్ అవ్వాలి. అలాంటిది బిగ్ బాస్ టీమ్ కాల్ తీసుకుని కావాలనే రవిని పంపించేసిందా అనే అనుమానాలు వస్తున్నాయి. అసలు బిగ్ బాస్ తెరవెనుక ఏం జరుగుతోంది ? ఇలా అయితే, మీకు నచ్చినవాళ్లకే టైటిల్ ఇచ్చేసుకోండి అంటూ బిగ్ బాస్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ అన్ని సీజన్స్ తో పోలిస్తే మాత్రం ఇది చాలా అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అనే అంటున్నారు అందరూ. అదీ మేటర్.