Magadheera: రిలీజ్‌కి ముందు ‘మగధీర’ గురించి ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే..?
March 13, 2023 / 03:09 PM IST
|Follow Us
ఒక సినిమాకి హీరో – డైరెక్టర్ కాంబినేషన్, సూపర్ హిట్ అవుతుందనే కథ.. సినిమాకు ప్లస్ అవుతారనుకునే నటీనటులు, సాంకేతిక నిపుణులను సెలక్ట్ చేసుకుని.. వారికి అడ్వాన్సుల దగ్గరి నుండి.. ఆ చిత్రానికి కొబ్బరి కాయ కొట్టిన దగ్గరి నుండి గుమ్మడి కాయ కొట్టే వరకు ప్రతి రూపాయ లెక్క కడుతూ.. కొన్ని సార్లు ఖర్చు ఎక్కువవుతున్నా.. ఔట్ పుట్ బాగా వస్తుందనే నమ్మకంతో ఉంటూ.. తెచ్చిన అప్పులకి వడ్డీలు కడుతూ.. నానా తంటాలు పడి సినిమాని థియేటర్లలోకి తీసుకొచ్చే వరకు ఒక నిర్మాత పడేది ప్రసవ వేదనే..
సినిమా హిట్ అయినా లాభాల కంటే పెట్టింది వస్తే చాలు అనుకునే వారూ ఉన్నారు.. ఏదైనా తేడా కొడితే అందరికంటే ముందు రోడ్డున పడేది మాత్రం నిర్మాతే.. ఇంత వివరంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. చరిత్ర సృష్టించే చిత్రాలు తీయాలంటే నిర్మాతకు గట్స్ ఉండాలి.. నలుగరూ నానా రకాలుగా చెత్త మాటలు మాట్లాడుతూ ప్రయత్నానికి అడుగడుగునా అడ్డుపడుతుంటారు.. అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాత కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది కూడా తన మేనల్లుడిని హీరోగా పెట్టి తీస్తున్న ‘మగధీర’ టైంలో..
సాధారణంగా అరవింద్ సినిమాలంటే లో బడ్జెట్ – హై బిజినెస్ అనే పేరుండేది.. దాన్ని చెరిపేస్తూ పవన్ కళ్యాణ్‌తో ‘జల్సా’ తీశారు. ఎంత భారీగా నిర్మించినా కానీ కలెక్షన్ల పరంగా వెనుక బడ్డానని ఇప్పటికీ అనుకుంటూ ఉంటారట.. ‘మగధీర’ విషయానికొస్తే.. రాజమౌళి దాదాపు రూ. 38 కోట్లు ఖర్చు పెట్టించాడని.. ఎంత భారీగా నిర్మించినా బయ్యర్లు కరువవ్వడంతో అరవింద్ ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారని.. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్‌తో మూడు భారీ చిత్రాలు నిర్మించొచ్చని.. ఆయనని ‘మగధీర’ ముంచడం ఖాయం అని చర్చించుకున్నారు.
కట్ చేస్తే.. ఇండస్ట్రీ రికార్డ్, కలెక్షన్ల సునామీ సృష్టించింది ‘మగధీర’.. రిలీజ్ తర్వాత మేధావుల మాటలేేంటంటే.. ‘‘నెగెటివ్ టాక్ నడవడం అనేది పెద్ద వింతేమీ కాదు. ఎందుకంటే, ‘మగధీర’ మామూలు సినిమా కాదు. తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పిన సినిమా. అదొక ఫినామినా. ఇప్పటి వరకు ఉన్న గత ఇండస్ట్రీ హిట్ ‘పోకిరి’ కలెక్ట్ చేసింది రూ. 40+ కోట్లు. అలాంటిది ఈ సినిమాకి రూ. 38 కోట్లు బడ్జెట్ పెట్టడం అంటే సాహసమే. అరివింద్ చేత అదే చేయించాడు రాజమౌళి’’ అని..