పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి, క్రేజ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా.. అతితక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. కెరీర్ స్టార్ట్ చేసి వరుసగా ఏడు సూపర్ హిట్లతో రికార్డ్ క్రియేట్ చేశాడు. పవన్ గురించి ఏ చిన్న వార్త వచ్చినా మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ సెన్సేషన్ అవుతుంది. ఇటీవల పవర్ స్టార్ ‘బద్రి’ టైంలో ఇచ్చిన ఇంటర్వూ న్యూస్ సందడి చేసింది.
ఇప్పుడు పవన్ హీరోగా అనౌన్స్ చేసి, ఆగిపోయిన ఓ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిశాయి.. వివరాల్లోకి వెళ్తే.. పవన్, ప్రఖ్యాత నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కాంబినేషన్‌లో ‘డైరీ ఆఫ్ మిసెస్ శారద’ అనే చిత్రం చేయాలనుకున్నారు. అప్పటికే మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘అభిలాష’, ‘ఛాలెంజ్’, ‘మరణమృదంగం’, ‘రాక్షసుడు’ లాంటి సూపర్ హిట్ సినిమాలు నవలా చిత్ర నాయకుడిగా యండమూరికి చక్కటి ఇమేజ్ తెచ్చిపెట్టాయి. ఆయన రాసిన అద్భుతమైన నవలలో ఒకటైన ‘డైరీ ఆఫ్ మిసెస్ శారద’ ఆధారంగా పవన్‌తో సినిమా చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు.
నవలలో కథానాయకుడు ‘బోస్’ క్యారెక్టర్ పరిచయమే. ఆ పాత్రకే పవన్‌ని ఫిక్స్ చేశారు. శారద రోల్‌లో నటించే నటితో పాటు ఇతర నటీనటులు, స్క్రీన్‌ప్లే వర్క్ జరుగుతుండగానే మూవీని పక్కన పెట్టేశారు. దీనికి కారణమేంటంటే.. కథగా డెవలప్ చేసే క్రమంలో.. ఈ నవల సినిమాగా సెట్ కాదు.. అందులోనూ పవన్ లాంటి స్టార్ ఇమేజ్‌కి అస్సలు సూట్ కాదని అర్థమై పక్కన పెట్టేశారు. నవల చదివిన వారికి కథ తెలుసు..
చదవని వాళ్లు టైటిల్ చూసి ఇదేదో లేడీ ఓరియంటెడ్ మూవీ అనుకునే అవకాశముందనే పలు కారణాలు కూడా వినిపించాయి. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ రైటర్ యండమూరి కలయికలో మూవీ ముందుకెళ్లలేదు. అన్నయ్య చిరంజీవికి నవలా కథలతో సూపర్ హిట్స్ ఇచ్చిన యండమూరితో వపన్ పని చేయలేకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది..
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!