ఆసక్తి రేపుతున్న కళ్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్

  • December 4, 2018 / 05:28 AM IST

నందమూరి కుటుంబానికి చెందిన హీరోల్లో అటు పూర్తిస్థాయిలో సక్సెస్ ఫుల్ కాలేక.. ఇటు మరీ ఉనికిని నిలబెట్టుకోలేని స్థాయిలోనూ లేక మధ్యస్థంగా ఉంటూ.. ఇప్పటికీ హీరోగా స్తిరపడడం కోసం ఆరాటపడుతున్న కథానాయకుడు కళ్యాణ్ రామ్. ఒక సూపర్ హిట్ లేదా మంచి హిట్ వచ్చింది అనేలోపు తదుపరి చిత్రంతో డిజాస్టర్ లేదా అంతకుమించిన ఫ్లాప్ ను దక్కించుకొని మునుపటి సూపర్ హిట్ క్రెడిట్ ను దర్శకుల ఖాతాలో వేసేస్తుంటాడు కళ్యాణ్ రామ్. అయితే.. మంచి మనిషి అనే మంచి పేరు ఉండడంతో ఇండస్ట్రీలో మాత్రమే కాక ఆడియన్స్ లో కూడా కళ్యాణ్ రామ్ కి ఒక మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది.

“ఎమ్మెల్యే”తో డీసెంట్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తర్వాత వచ్చిన “నా నువ్వే”తో దారుణమైన డిజాస్టర్ ను దక్కించుకొన్నాడు. మళ్ళీ ఇప్పుడు కె.వీ.గుహన్ దర్శకత్వంలో “118” అనే చిత్రంలో నటిస్తున్నాడు. నిన్న ఈ చిత్రం టైటిల్ లోగోను విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నివేదా థామస్, షాలిని పాండే కథానాయికలుగా నటిస్తున్నారు. ఇంతకీ ఈ 118 ఏంటా అనే ఆసక్తి ఆడియన్స్ లో మొదలైంది. టైటిల్ తోనే ఆసక్తి రేపగలిగాడంటే.. సరిగ్గా ప్లాన్ చేసుకొంటే జనవరిలో విడుదలకానున్న ఈ చిత్రంతో కళ్యాణ్ రామ్ ఒక డీసెంట్ హిట్ కొట్టడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus