Hi Nanna Movie: హాయ్ నాన్న టైటిల్ వెనుక అంత కథ ఉందా?

  • July 18, 2023 / 09:52 PM IST

కొత్త సినిమాలకి పాత సినిమాల టైటిల్స్ పెట్టడం..అందులోనూ సూపర్ హిట్ సినిమాల టైటిల్స్ పెట్టడం అనేది కొత్త విషయం కాదు. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ, ఖుషి సినిమాల టైటిల్స్ తో కొత్త సినిమాలు వస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే సినిమాలో బలమైన కంటెంట్ ఉంటే తప్ప సూపర్ హిట్ సినిమాల టైటిల్స్ ను టచ్ చేయకూడదు. అలా చేస్తే ఆ హిట్ సినిమాలకి ఉన్న అభిమానులు హర్ట్ అవుతారు.

ఇప్పుడు అసలు విషయానికి వచ్చేస్తే.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆల్ టైం హిట్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో గ్యాంగ్ లీడర్ ఉంటుంది. అది పక్కా మాస్ సినిమా . చిరు ఫ్యాన్స్ రిపీటెడ్ గా చూసే ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఎన్నో ఉంటాయి. ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్ పెట్టుకోవాలి అంటే.. అలాంటి మాస్ కంటెంట్ ఉండాలి. కానీ నాని తన సినిమాకి ఆ టైటిల్ పెట్టుకుని డిజప్పాయింట్ చేశాడు. ప్రమోషన్ కోసం ఆ టైటిల్ (Hi Nanna) ఉపయోగపడింది కానీ .. ఆ సినిమా ఫలితాన్ని మార్చలేకపోయింది.

పైగా వివాదాస్పదం కూడా అయ్యింది.ఇదిలా ఉండగా.. యాదృచ్ఛికంగా మరోసారి నాని .. చిరు టైటిల్ ను కాపీ కొట్టాడట. వివరాల్లోకి వెళితే.. నాని హీరోగా హాయ్ నాన్న అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఇదే టైటిల్ ను చిరు – కళ్యాణ్ కృష్ణ కురసాల ప్రాజెక్ట్ కోసం అనుకున్నారట. కానీ నాని 30 వ సినిమాకి అనౌన్స్ చేయడంతో చిరు మూవీ టీమ్ కాంప్రమైజ్ అయిపోయి .. ఇప్పుడు వేరే టైటిల్ కోసం పరిశీలిస్తున్నట్టు సమాచారం.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus