ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు బాహుబలి, బాహుబలి2 సినిమాలు మాత్రమే రెండు భాగాలుగా తెరకెక్కాయి. సినిమా హిట్టైన తరువాత కొందరు డైరెక్టర్లు ఆ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నా దర్శకులు ఒకే సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించే సాహసం మాత్రం చేయలేదు.
అల వైకుంఠపురములో సినిమా సక్సెస్ తరువాత అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి పుష్ప స్క్రిప్ట్ ప్రకారం సినిమా నిడివి చాలా ఎక్కువగా వస్తుందని తెలుస్తోంది. అందువల్ల రెండు పార్టులుగా రిలీజ్ చేయాలనే ఆలోచనను లీక్ చేసి ఫ్యాన్స్ అభిప్రాయం కనుక్కోవాలని పుష్ప మేకర్స్ ఆలోచించినట్టు సమాచారం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నిర్మాతలు భారీ మొత్తం ఖర్చు చేస్తున్నారు.
ప్రస్తుతానికైతే పుష్ప సినిమాలో నటిస్తున్న నటీనటులు పుష్ప ఒక పార్ట్ గానే తెరకెక్కుతుందని చెబుతున్నారు. అయితే సుకుమార్ టీం ప్రేక్షకుల అభిప్రాయలను పరిశీలించి సినిమా గురించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పుష్ప పార్ట్ వన్ ఫ్లాప్ అయితే పార్ట్ 2 పరిస్థితి ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. పుష్ప రెండు పార్టుల గురించి స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు పుష్ప మూవీ అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!