Samantha: పెళ్ళిలో సమంత ధరించిన చీర గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
October 5, 2021 / 07:12 PM IST
|Follow Us
ఎవ్వరూ ఊహించని విధంగా సమంత, నాగచైతన్యలు విడిపోతున్నట్టు ప్రకటించి అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పాలి. దీంతో వీళ్ళ కుటుంబసభ్యులు అయిన నాగార్జున, అమల వంటి వారు కూడా ఎమోషనల్ కామెంట్స్ చేసిన సందర్భాలను మనం చూసాం.ఇది పక్కన పెడితే.. 4 రోజుల నుండీ ‘చైసామ్’ ల జర్నీని ఒకసారి గుర్తుచేసుకుంటున్నారు వారి అభిమానులు.కొంచెం వెనక్కి వెళ్లి వీరి పెళ్లి నాటి సంగతులని కూడా గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో నిశ్చితార్ధం, పెళ్లి వేడుకల్లో సమంత ధరించిన చీరల గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
నిశ్చితార్థం, పెళ్లి రోజున సమంత ధరించిన చీరలని ప్రముఖ డిజైనర్ క్రేశా బజాజ్ డిజైన్ చేసాడు. సమంతకి నాగ చైతన్యతో పరిచయమైనప్పట్నుంచి, వారి పెళ్లి వరకు జరిగిన ప్రతీ సందర్భాన్ని గుర్తు చేసే విధంగా పలు బొమ్మల రూపంలో చీరని డిజైన్ చేశాడు డిజైనర్ క్రేశా బజాజ్.దీనిని సమంత నిశ్చితార్ధం రోజున ధరించింది. ఇక పెళ్లిలో సమంత ధరించిన చీర చైతన్య అమ్మమ్మగారు అయిన దగ్గుబాటి రాజేశ్వరిదట. అంటే రామనాయుడి గారి భార్యదన్న మాట.
అదే చీరని రీ మోడలింగ్ చేసి.. పెళ్లిలో సమంత ధరించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం రూ. 40 లక్షల వరకు ఖర్చయినట్టు తెలుస్తోంది. అలాగే ఈ చీర రీ మోడలింగ్ వర్క్ చేయించడానికి ఆశ్రిత మరియు రానా భార్య మిహీక(అప్పటికి పెళ్లి కాలేదు) లు చాలా టైం కేటాయించినట్టు తెలుస్తుంది.