Prabhas , Hanu Raghavapudi: హను – ప్రభాస్..ల ప్రాజెక్టు వెనుక ఇంత ‘కథ’ ఉందా?
August 20, 2024 / 08:38 PM IST
|Follow Us
ప్రభాస్ (Prabhas) , దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్..లు నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు రెండు రోజుల క్రితం జరిగాయి. ఇమాన్వి అనే అమ్మాయిని ప్రభాస్ కి జోడీగా ఎంపిక చేసుకున్నారు. కథ విషయం పై కూడా ఓ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.ఇది ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా. 1940 – 1945 ల టైంలో జరిగే ఓ ఆర్మీ బ్యాక్ డ్రాప్లో ఉండబోతుంది.
Prabhas , Hanu Raghavapudi
రెండవ ప్రపంచ యుద్ధంతో కూడా ఈ కథ ముడిపడి ఉంటుందని టీం క్లారిటీ ఇచ్చేసింది.ప్రభాస్ వంటి వెయ్యి కోట్ల హీరోతో తీస్తే.. దీనికి రీచ్ ఎక్కువ ఉంటుంది. దర్శకుడు హను రాఘవపూడి ఆలోచన కూడా అదే..! అయితే ఈ కథ ముందుగా ప్రభాస్ కోసం అనుకున్నది కాదట. చిత్ర బృందం అయితే ఇలా చెప్పలేదు కానీ.. సోషల్ మీడియాలో ఈ అంశంపై ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. విషయం ఏంటంటే.. గతంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్లో హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు హీరో నాని (Nani) పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.
అదే ‘ ‘సీతా రామం’ (Sita Ramam) కథ అయ్యుంటుంది’..అని కొందరు ఆ సినిమా విడుదల టైంలో అభిప్రాయపడ్డారు. కానీ దర్శకుడు హను రాఘవపూడి అందులో నిజం లేదు అని క్లారిటీ ఇచ్చాడు. నానితో చేయాలనుకున్నది ‘సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ తో కూడిన ఆర్మీ ఆఫీసర్ కథ’ అని చెప్పుకొచ్చాడు. అలా చూసుకుంటే ఇప్పుడు ప్రభాస్ తో హను చేస్తున్న కథ కూడా అదే..! బహుశా నానికి పాన్ ఇండియా మార్కెట్ లేదు కాబట్టి.. ప్రభాస్ తో ఆ కథని హను తెరకెక్కిస్తున్నాడేమో అని అంతా అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.