Samantha: ‘శాకుంతలం’ ప్రమోషన్స్ కు సమంత దూరం!

  • April 12, 2023 / 08:20 PM IST

టాలీవుడ్ టాప్ హీరోయిన్, శాకుంతలం హీరోయిన్ సమంత కొంతకాలంగా మయోసైటిస్‌ అనే భయకరమైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆమె ఆనారోగ్యం నుంచి కాస్త కోలువడంతో వరుసగా షూటింగ్స్‌, ప్రమోషన్స్‌ చేస్తూ ఫుల్‌ బిజీగా గడిపారు. షెడ్యూల్స్ మధ్య గ్యాప్ లేకపోవడంతో ఆమె జ్వరం బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పారు. అందువల్ల బుధవారం సాయంత్రం జరగనున్న ‘శాకుంతలం’ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో పాల్గొనడం లేదని వెల్లడించారు.

‘‘ఈ వారమంతా మీ మధ్యనే ఉండి సినిమా ప్రమోషన్ చేసి ప్రేమాభిమానాలు పొందినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. వరుస షూటింగ్స్, ప్రమోషన్స్ వల్ల దురదృష్టవశాత్తు అనారోగ్యానికి గురయ్యాను. జ్వరం వల్ల నా శరీరం సత్తువను కోల్పోయింది. గొంతును కూడా పొగొట్టుకున్నాను. ఈ రోజు సాయంత్రం ‘ఎమ్‌ఎల్‌ఆర్‌ఐటీ’లో జరిగే వార్షికోత్సవంలో నేను పాల్గొనలేకపోతున్నా. మీ అందర్ని మిస్ అవుతున్నా. శాకుంతలం టీమ్‌తో కలసి కార్యక్రమాన్ని ఆస్వాదించండి’’ అని సామ్ తెలిపారు.

‘యశోద’ వంటి భారీ హిట్ తర్వాత సామ్ (Samantha) నుంచి వస్తున్న సినిమా ‘శాకుంతలం’. అభిజ్ఞాన శాకుంతలం కావ్యంలోని దుష్యంతుడు, శకుంతల కథ ఆధారంగా చిత్రాన్ని రూపొందించారు. గుణ శేఖర్ తెరకెక్కించారు. గుణ్ టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందింది. పలు భాషల్లో ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

త్రీడీలోను సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. సామ్ అనారోగ్యం నుంచి కాస్త కోలుకోవడంతోనే ‘సిటడెల్’ ను పట్టాలెక్కించారు. ఈ వెబ్‌సిరీస్ చిత్రీకరణ ముంబైలో జరుగుతున్న సమయంలో ఆమె ‘శాకుంతలం’ ప్రమోషన్స్‌ను అక్కడే చేశారు. కొన్ని రోజులు ‘ఖుషి’ షూటింగ్‌లోను పాల్గొన్నారు. ఈ సినిమా చిత్రీకరణ కేరళలో జరిగినప్పుడు అక్కడ ప్రచార కార్యక్రమాలను చేపట్టారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus