Rana Daggubati, Sai Pallavi: విరటపర్వం నుంచి పవర్ఫుల్ వాయిస్!

  • December 14, 2021 / 12:28 PM IST

వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా మంచి గుర్తింపు అందుకుంటుంది అని పలువురు చిత్ర యూనిట్ సభ్యులు కూడా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. సినిమాకు సంబంధించిన మరొక పవర్ ఫుల్ వాయిస్ టీజర్ ను రానా పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు.

ద వాయిస్ ఆఫ్ రవన్నా అంటూ అభ్యుదయ భావాలున్న ఒక ప్రత్యేకమైన పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు.1990 ల కాలంలో నిజజీవితంలోని విప్లవ వీరుల విజయ గాధ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా విరాటపర్వం. అయితే ఈ సినిమాలో రానా దగ్గుబాటి ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. నక్సలైట్ లీడర్ రవన్నా అనే క్యారెక్టర్ కు సంబంధించిన ఒక పవర్ఫుల్ వాయిస్ ను చిత్ర యూనిట్ సభ్యులు రానా పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు.

ఇక టీజర్ లో పవర్ ఫుల్ వాయిస్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ‘మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం. రౌద్రం శత్రువుల దాడిని ఎదిరించే పోరాటం మనది.. ఛలో.. అంటూ కొనసాగే రాణా గాంభీర్యమైన కవిత ఎంతగానో ఆలోచింపజేస్తుంది. నిజ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పవర్ ఫుల్ వాయిస్ తో మరింత ఆసక్తిని రేపుతోంది. ఇక సంక్రాంతి కానుకగా సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు.

సాయి పల్లవి ఈ సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రలో కనిపిస్తోంది. అభ్యుదయ భావాలు కలిగిన కామ్రేడ్ రవన్న కోసం ఆమె అజ్ఞాత ప్రేమికురాలిగా నటిస్తోంది. ఇక చివరికి అతన్ని ఎలా కలుసుకుంది అనే సన్నివేశాలు సినిమాలో అద్భుతంగా ఉంటాయట. సీనియర్ నటి ప్రియమణి కూడా ఈ సినిమాలో నక్సలైట్ గా కనిపించబోతోంది. సినిమాలో వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!


‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus