ఇంకొన్నాళ్ళు ఓటీటీలతోనే సరిపెట్టుకోవాలా..

  • December 2, 2020 / 01:53 PM IST

కరోనా తగ్గుతుందో లేదో తెలియదు కానీ.. ఆ వైరస్ తాలూకు భయం మాత్రం జనాల్లో లేదు. అయితే.. ఆ ఎఫెక్ట్ మాత్రం సినిమా ఇండస్ట్రీని వదలడం లేదు. ఆల్రెడీ అన్ని ఇండస్ట్రీలు పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలై ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాయి. కానీ.. సినిమా ఇండస్ట్రీ మాత్రం పూర్తి స్థాయిలో కోలుకోలేకపోతొంది. ప్రభుత్వం థియేటర్లు రీఓపెన్ చేసుకోవచ్చు అని పర్మిషన్ లు ఇచ్చినప్పటికీ.. 50% టికెట్లు మాత్రమే ఫిల్ చేయాలి అని కండిషన్ పెట్టడం చాలామంది నిర్మాతలకు నచ్చలేదు.

మరీ ముఖ్యంగా బడా సినిమా నిర్మాతలకు ఇది చాలా బ్యాడ్ న్యూస్. అందుకే.. ఇప్పటివరకు ఒక్క పెద్ద సినిమా కూడా తమ విడుదల తేదీని ప్రకటించలేదు. డిసెంబర్ లో పలు చిన్న సినిమాలు విడుదలవుతున్నప్పటికీ.. అవి చూడడానికి జనాలు థియేటర్లకు పరిగెత్తుకుంటూ వస్తారా లేదా అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్. ఇప్పటివరకు హైదరాబాద్ లో కేవలం మూడు థియేటర్లు మాత్రమే అఫీషియల్ గా స్క్రీనింగ్స్ మొదలెట్టాయి. అది కూడా హాలీవుడ్ సినిమా “టెనెట్”తో.

డైరెక్ట్ గా నమ్రత రంగంలోకి దిగి థియేటర్లకు రండి అని ఆహ్వానిస్తోంది. ఈ సినిమాకి జనాల్లో భీభత్సమైన క్రేజ్ ఉంది కాబట్టి బుకింగ్స్ కూడా బాగానే అవుతున్నాయి. అయితే.. మీడియం బడ్జెట్ చిత్రాలకు జనాల నుండి ఇదే స్థాయి రెస్పాన్స్ వస్తుందా అనేది మాత్రం సందేహమే. కరోనా తీవ్రత చూస్తుంటే థియేటర్లలో 50% మించి జనాలకి పర్మిషన్ ఇవ్వడం అనేది వారి ప్రాణాలతో చెలగాటం ఆడడమే. మరి ఈ విపత్కర పరిస్థితి నుండి ఇండస్ట్రీ ఎలా బయటపడుతుందో చూడాలి. అప్పటివరకు దర్సకనిర్మాలకు ఓటీటీలే గతి.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus