ఓటీటీల జోరు పెరిగాక సినిమా అంటే… మొబైల్‌లో చూడటం లేదంటే ఇంట్లో టీవీల్లో చూడటం అయిపోయింది. థియేటర్లలో సినిమాలు వస్తున్నా… టికెట్ ధరల భయం లేక కరోనా భయం కారణంగా జనాలు రావడం లేదు. తొలి భయం గురించి మనం ఇప్పుడు మాట్లాడం కానీ… కరోనా భయమే అయితే దానికో సొల్యూషన్ తీసుకొచ్చింది హైదరాబాద్‌కి చెందిన ఓ సంస్థ. మినీ థియేటర్ కంటే చిన్నగా ఓ గదిలో థియేటర్‌ను ఏర్పాటు చేశారు.
దానిని బుక్ చేసుకొని, మీకు నచ్చిన సినిమాను ఎంచక్కా చూసేయొచ్చు. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. ఆ వివరాలు ఇవీ… కేవలం ఒక ఫ్యామిలీ మాత్రమే సినిమా చూసేలా స్టార్ ట్రాక్ గ్రూప్ అనే సంస్థ హైదరాబాద్‌లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన థియేటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చిన్నపాటి థియేటర్‌ను అద్దెకు తీసుకుని మనకి నచ్చిన సినిమాను కుటుంబంతో సహా చూసేయొచ్చు. గరిష్ఠంగా ఏడుగురు ఒకేసారి ఈ థియేటర్‌లలో కూర్చొని సినిమాలు చూసే వీలుంది.
ఈ మినీ ఫ్యామిలీ థియేటర్‌ను రోజుకు మూడు షోలకు అద్దెకు ఇస్తున్నారు. షో సమయం, రోజు తదితర వివరాల బట్టి ఒక్కో షోకి ఒక్కో ధర నిర్ణయించారు. షోకు కనిష్టంగా ₹1500, గరిష్ఠంగా ₹1900లు రెంట్ వసూలు చేస్తారు. ఈ థియేటర్‌లో ఎలాంటి భయాలు లేకుండా మీకు నచ్చిన చిత్రాలను వీక్షించొచ్చని సంస్థ చెబుతోంది. ప్రతి షోకి ముందు, తర్వాత పూర్తిగా శానిటైజ్ చేస్తామని కూడా చెబుతోంది. ఇందులో ఓటీటీలోని సినిమాలు, కుటుంబ వ్యక్తిగత కార్యక్రమాల వీడియోలను వీక్షించొచ్చు.
ఇందులో 142 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. రెక్లెయినర్ చెయిర్స్ ఇస్తున్నారు. ఆడియో సిస్టమ్ థియేటర్లకు ఏ మత్రం తీసిపోని విధంగా ఉంటుందని చెబుతున్నారు. 15 స్పీకర్లను వినియోగిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని సర్థార్‌పటేల్ రోడ్‌లో స్టార్ ట్రాక్ గ్రూప్‌కి ఈ థియేటర్‌ను ఏర్పాటు చేసింది. మరిన్ని వివరాలు కావాలంటే ఆ సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సిందే. అయితే థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇక్కడ చూస్తామంటే కుదరదు. కేవలం ఓటీటీల్లోని సినిమాలు చూడొచ్చు. అయితే వాటి సబ్‌క్రిప్షన్ మీ వద్ద ఉండాలి.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!