16 ఏళ్ల క్రితం ప్రభాస్ విషయంలో జరిగింది.. ఇప్పుడు అఖిల్ కు కూడా జరుగనుందా ..?
July 18, 2020 / 02:30 PM IST
|Follow Us
అక్కినేని మూడో తరం హీరో అయిన అఖిల్ తన 4వ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ‘జిఏ2 పిక్చర్స్’ సంస్థ నిర్మిస్తుంది. ‘అఖిల్’ ‘హలో’ ‘మిస్టర్ మజ్ను’ వంటి చిత్రాలతో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు అఖిల్. ఇక ‘ఆరెంజ్’ ‘ఒంగోలు గిత్త’ సినిమాల తరువాత బొమ్మరిల్లు భాస్కర్ కూడా హిట్టు కొట్టలేదు. దీంతో వీళ్ళిద్దరూ హిట్టు కొట్టాలని కసిగా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక లాక్ డౌన్ టైములో నాగార్జున కూడా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ కు సంబంధించిన రషెస్ చూసి ఎంతో సంతృప్తిగా ఫీలయ్యాడట. అయితే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ చిత్రాన్ని సమ్మర్లోనే విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేసినప్పటికీ.. లాక్ డౌన్ వల్ల కుదరలేదు. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితిలు కూడా కనిపించడం లేనందున 2021 సంక్రాంతికే విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. అఖిల్ సినిమాతో పాటు చిరు ‘ఆచార్య’ అలాగే బాలయ్య- బోయపాటి ల సినిమాలు కూడా ఆ టైంకే విడుదలవుతాయని సమాచారం.
అదే కనుక జరిగితే ప్రభాస్ సెంటిమెంట్ అఖిల్ విషయంలో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉందట. 2004 లో చిరంజీవి ‘అంజి’ , బాలయ్య ‘లక్ష్మీ నరసింహా’ సినిమాల పక్కన ప్రభాస్ ‘వర్షం’ కూడా విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యింది. ప్రభాస్ కు మొదటి హిట్ కూడా అదే. ఇప్పుడు అదే సెంటిమెంట్ అఖిల్ విషయంలో కూడా రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కొందరు విశ్లేషకుల అభిప్రాయం.