దిల్ రాజు సినిమాలకు మాత్రమే రెండు సార్లు అలా కలిసొచ్చింది..!
September 14, 2020 / 07:46 PM IST
|Follow Us
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు టాప్ ప్లేస్లో ఉంటాడు అనడంలో సందేహమే లేదు. ఈయన బ్యానర్ నుండీ సినిమా వస్తుంది అంటే 80 శాతం హిట్ అని అంతా ఫిక్స్ అయిపోతారు. ఈయన జడ్జిమెంట్ కూడా అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. దాంతో పాటు ఈయన సినిమాని ప్రమోట్ చేసే విధానం కూడా అదే స్థాయిలో ఉంటుంది. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఒక్కోసారి ఈయన సినిమాలు అనుకున్న స్థాయిలో లేకపోయినా పెద్ద సీజన్ ను బట్టి సూపర్ హిట్లు అయిపోతుంటాయి. అలా ఎన్నో సినిమాలు ఉన్నాయి కానీ.. ముఖ్యంగా రెండు సినిమాల గురించి మనం మాట్లాడుకోవాలి.
వాటిలో ఒకటి ‘ఎవడు’ … రెండొవది ‘వి’. ఈ రెండు చిత్రాలను కూడా థ్రిల్లర్స్ అంటూ… మల్టీ స్టారర్స్ అంటూ ఓ రేంజ్లో ప్రమోట్ చేసాడు నిర్మాత దిల్ రాజు. అయితే ఈ రెండు చిత్రాలు స్థాయిలో ఉండవు.పైగా అదృష్టం కొద్దీ ఈ చిత్రాలు నష్టాల నుండీ తప్పించుకున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ‘ఎవడు’ చిత్రాన్ని అల్లు అర్జున్ – రాంచరణ్ ల మల్టీ స్టారర్ అని ప్రమోట్ చేసిన దిల్ రాజు.. ఆ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనేవి లేకపోగా ఓకే టికెట్ పై రెండు సినిమాలను చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది.2013లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం .. మరోపక్క సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న తరుణంలో పెద్ద సినిమాలు విడుదల కాలేదు.చాలా చోట్ల థియేటర్లు మూతపడ్డాయి. ఆ క్రమంలో ‘ఎవడు’ సినిమా విడుదల ఆగిపోయింది.
అప్పుడు కనుక విడుదల అయ్యి ఉంటే రిజల్ట్ తేడా కొట్టేది. ఆ తరువాత 2014లో సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది. ఆ టైములో మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ చిత్రం డిజాస్టర్ కావడంతో ‘ఎవడు’ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టి ఎబౌవ్ యావరేజ్ మూవీగా నిలిచింది.శాటిలైట్ రైట్స్ తో దిల్ రాజు సేఫ్ అయిపోయాడు. మళ్ళీ 6 ఏళ్ళ తరువాత ‘వి’ విషయంలో కూడా అదే రిపీట్ అయ్యింది. కరోనా కారణంగా మార్చి లో విడుదల కావాల్సిన ఈ చిత్రం రిలీజ్ కాలేదు.ఒకవేళ అప్పుడు కానీ ‘వి’ విడుదల అయ్యి ఉంటే.. కచ్చితంగా ఫ్లాప్ అయ్యి భారీ నష్టాలను చవిచూసేది అనడంలో సందేహం లేదు.మళ్ళీ 5నెలలు ఓపిక పట్టి మంచి రేటుకి(35.4 కోట్లకి) అమెజాన్ ప్రైమ్ వారికి అమ్మేసాడు దిల్ రాజు. ఇక శాటిలైట్ రైట్స్ కూడా 8 కోట్లకు జెమినీ వారికి అమ్మేసి సేఫ్ అయిపోయాడు. ఇలా రెండు సార్లు దిల్ రాజు భారీ నష్టాల నుండీ బయటపడ్డాడని చెప్పొచ్చు.