Chiranjeevi: చిరు అల్లూరి విగ్రహావిష్కరణ ఆహ్వానం వెనుక ఇంత రాజకీయం జరిగిందా?
July 9, 2022 / 03:02 PM IST
|Follow Us
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను జూలై 4వ తేదీ భీమవరంలో ఎంతో ఘనంగా చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పాల్గొని అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేశారు.ఈ వేడుకకు ఎంతోమంది రాజకీయ నాయకులు హాజరుకాగా సినీ పరిశ్రమకు చెందిన వారిలో కేవలం మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే ఆహ్వానం అందింది.ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో ఈయన గతంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేయడంతో ఆహ్వానం అందిందని అందరూ భావించారు.
ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరు కావడం వెనుక మరొక కారణం ఉందని తాజాగా బయటపడింది.తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి కోటాలో భాగంగా నలుగురు సభ్యులను రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ను ఈ అదృష్టం వరించింది. అయితే ముందుగా ఈ అవకాశం మెగాస్టార్ చిరంజీవికి వచ్చిందని తెలుస్తోంది. బీజేపీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముందుగా మెగాస్టార్ చిరంజీవితో ఈ విషయం గురించి సంప్రదింపులు చేయగా చిరంజీవి ఎంతో సున్నితంగా ఈ అవకాశాన్ని తిరస్కరించారని తెలుస్తోంది.
ప్రస్తుతం తాను సినిమాలతో బిజీగా ఉన్నాను తనకు రాజకీయాలలోకి వచ్చే ఆసక్తి ఏమాత్రం లేదని చెబుతూ ఈ అవకాశాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది.ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి ఈ అవకాశాన్ని వదులుకోవడంతోనే ఆ అవకాశం రాజమౌళి తండ్రికి వచ్చిందని వార్తలు వినపడుతున్నాయి. ఈ విధంగా బీజేపీ చిరంజీవితో సంప్రదింపులు జరిపి ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేశారని అయితే చిరంజీవి మాత్రం రాజకీయాలలోకి రావడానికి ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది.
గతంలో ఈయన కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజీనామా చేయకపోయినా పార్టీ తరపున ఏ విధమైనటువంటి ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొనలేదు. తనకు రాజకీయాలు సెట్ కాలేదని తనకు సినీ ఇండస్ట్రీ నే ఎంతో కంఫర్ట్ గా ఉందని అందుకే తాను రాజకీయాలలోకి రానని గతంలో కూడా మెగాస్టార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చిరంజీవి గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతుంది.