స్టార్ హీరోలు నటించినా కానీ తెలుగులో రిజల్ట్ తేడా కొట్టిన10 సినిమాలు ఇవే..!
March 4, 2023 / 11:34 AM IST
|Follow Us
సాధారణంగా ఒక భాషలో రీమేక్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం అనేది ఫిలిం ఇండస్ట్రీలో మామూలే.. ఈజీనే అనుకుంటారు కానీ అనుకున్నంత సులువేం కాదు.. ప్రాంతం, నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసినా.. స్టోరీలోని సోల్ మిస్ కాకుండా చూసుకోవాలి.. జాగ్రత్తగా డీల్ చేస్తే హిట్ కొట్టొచ్చు కానీ ఏమాత్రం తేడా కొట్టినా అసలుకే ఎసరు తప్పదు.. అలా మన తెలుగులోనూ ఇతర భాషల చిత్రాలు రీమేక్ చేసి సూపర్ హిట్స్ కొట్టారు మేకర్స్.. కొన్నిసార్లు మాత్రం రిజల్ట్ తేడా కొట్టింది.. హిందీ తమిళ్, కన్నడ మూవీస్ రీమేక్స్ చేసి డీలా పడ్డ టాలీవుడ్ స్టార్స్ ఎవరు.. ఆ 10 సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..
1) చిరంజీవి – శంకర్ దాదా జిందాబాద్..
బాలీవుడ్ ‘మున్నాభాయ్ MBBS’ రీమేక్‌తో సూపర్ హిట్ కొట్టిన చిరంజీవి.. దాని సీక్వెల్ ‘లగేరహో మున్నాభాయ్’ రీమేక్ చేయగా డిజాస్టర్ అయింది.. రీ ఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’, ‘గాడ్ ఫాదర్’ రీమేక్స్‌తో అలరించారు చిరు..
2) పవన్ కళ్యాణ్ – తీన్ మార్..
హిందీలో సైఫ్ అలీ ఖాన్ చేసిన ‘లవ్ ఆజ్ కల్’ రీమేక్ ‘తీన్ మార్’.. పవన్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో ఆకట్టుకున్నాడు.. సాంగ్స్, కొన్ని సీన్స్, డైలాగ్స్ బాగుంటాయి కానీ సినిమా అనుకున్నంతగా ఆడలేదు..
3) రవితేజ – వీడే..
మాస్ మహారాజా రవితేజ.. తమిళంలో చియాన్ విక్రమ్ నటించిన ‘ధూల్’ రీమేక్.. అక్కడ హిట్ అయింది కానీ ఇక్కడ రవితేజ మార్క్ కామెడీ మిస్ అవడం.. పైగా సీరియస్ కథ కావడంతో ఆకట్టుకోలేకపోయింది..
4) మోహన్ బాబు – పొలిటికల్ రౌడీ..
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఛార్మీ, అబ్బాస్ నటించిన ‘పొలిటికల్ రౌడీ’ తమిళంలో సత్యరాజ్, అబ్బాస్, రతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘అడిథడి’ రీమేక్.. ఇక్కడ ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది..
5) నాగార్జున – స్నేహమంటే ఇదేరా..
జయరాం, ముఖేష్, శ్రీనివాసన్, మీనా తదితరులు నటించిన మలయాళం మూవీ ‘ఫ్రెండ్స్’ ని ‘స్నేహమంటే ఇదేరా’ పేరుతో నాగార్జున, సుమంత్, సుధాకర్, భూమికలతో తీశారు.. సాంగ్స్ బాగానే ఉంటాయి కానీ సినిమానే తేడా కొట్టేసింది..
6) అల్లరి నరేష్ – ధనలక్ష్మీ ఐ లవ్ యూ..
సీనియర్ నరేష్, అల్లరి నరేష్, ఆదిత్య ఓం హీరోలుగా ‘ధనలక్ష్మీ ఐ లవ్ యూ’ అనే మూవీ వచ్చింది.. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘రామ్ జీ రావ్ స్పీకింగ్’ కిది రీమేక్.. తెలుగులో డిజాస్టర్‌గా నిలిచింది..
7) జగపతి బాబు – బడ్జెట్ పద్మనాభం..
తమిళంలో ప్రభు, రమ్యకృష్ణ నటించగా సూపర్ హిట్ అయిన ‘బడ్జెట్ పద్మనాభన్’ మూవీని తెలుగులో జగపతి బాబు, రమ్యకృష్ణలతో ‘బడ్జెట్ పద్మనాభం’ గా తెరకెక్కించారు.. రవితేజ, ఎల్బీ శ్రీరాం కామెడీ బాగుంటుంది కానీ అంచనాలను అందుకోలేకపోయింది..
8) వినయ్ – వాన..
కన్నడంలో బ్లాక్ బస్టర్ అయిన ‘ముంగారు మలే’ ను దర్శకుడిగా మారి తెలుగులో ‘వాన’ పేరుతో తీశారు నిర్మాత ఎమ్.ఎస్. రాజు.. హీరో వినయ్ కొత్త వాడు పైగా ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో తేడా కొట్టేసింది..
9) శివాజీ – తాజ్ మహల్..
అప్పటికే కొన్ని రీమేక్స్‌తో హిట్స్ కొట్టడంతో.. ‘రీమేకులు నాకు మైసూరు పాకులు’ అని చెప్పేవాడు హీరో శివాజీ.. కన్నడంలో సంచలన విజయం సాధించిన ‘తాజ్ మహల్’ ని అదే పేరుతో చేశాడు.. హీరో చనిపోవడం మన ఆడియన్స్‌కి నచ్చలేదు..
10) రామ్ – రెడ్..
రామ్ పోతినేని ద్విపాత్రాభినయం చేసిన ‘రెడ్’ మూవీ తమిళంలో అరుణ్ విజయ్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘తడమ్’ రీమేక్.. రామ్ కొత్తగా ప్రయత్నించాడు కానీ సినిమా తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు..