OTT: ఓటీటీలో ఆ 5సినిమాల విడుదల కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్..!
September 6, 2023 / 06:01 PM IST
|Follow Us
ఒకప్పుడు థియేటర్లో విడుదలైన సినిమా టీవీలో ప్రసారం కావాలంటే నెలలు పట్టేది. ఓటీటీ వేదికల హవా కొనసాగుతున్న నేడు ఎంత పెద్ద సినిమా అయినా ఐదారు వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతోంది. ఫ్లాప్ అయిన అగ్ర హీరోల సినిమాలైతే మూడు వారాల్లోపే వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. మరి ఈ ఏడాది థియేటర్లో విడుదలైనా ఇప్పటివరకూ ఓటీటీలోకి రాని సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటి? చూద్దం.
‘జర హట్కే జర బచ్కే’ వచ్చేనా?
విక్కీ కౌశల్, సారా అలీఖాన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘జర హట్కే జర బచ్కే’ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకుడు. ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. జియో సినిమా ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. ఎప్పుడెప్పుడు ‘జరా హట్కే..’ వస్తుందా? చూద్దామని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘ఏజెంట్’
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అఖిల్ ‘ఏజెంట్’ ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను సోనీలివ్ దక్కించుకోగా, విడుదల స్ట్రీమింగ్ తేది ప్రకటించి మరీ వెనక్కి తగ్గారు. ఇప్పటివరకూ సినిమా గురించి ఎలాంటి సమాచారం లేదు.
‘ది కేరళ స్టోరీ’
అదాశర్మ కథానాయికగా దర్శకుడు సుదీప్తోసేన్ రూపొందిన వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ఇదీ ఒకటి. తమ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఓటీటీ సంస్థ ఆసక్తి చూపడం లేదని దర్శకుడే స్వయంగా ప్రకటించారు. అయితే, జీ5 స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్నట్లు వార్తలు వచ్చినా, ఇప్పటివరకూ స్ట్రీమింగ్పై ఎలాంటి అప్డేట్ లేదు.
‘రామబాణం’
శ్రీవాస్ దర్శకత్వంలో గోపిచంద్, డింపుల్ హయాతీ కీలక పాత్రల్లో నటించిన యాక్షన్ డ్రామా ‘రామబాణం’. ఈ ఏడాది మే 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా, ఇప్పటివరకూ ఓటీటీ స్ట్రీమింగ్పై ఎలాంటి అప్డేట్ లేకపోవడం గమనార్హం. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను కూడా సోనీలివ్ దక్కించుకున్నా, ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా వెలువరించలేదు.
జ్విగాటో
స్టాండప్ కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కపిల్ శర్మ. నందితా దాస్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘జ్విగాటో’. షహనా గోస్వామి కథానాయిక. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు, టొరంటో వరల్డ్‌వైడ్ ఫిల్మ్ సెలబ్రేషన్స్-2022లోనూ ప్రదర్శితమైంది. ఈ సినిమా కూడా ఇప్పటివరకూ ఓటీటీ స్ట్రీమింగ్కు (OTT) రాకపోవడం గమనార్హం.