Shaakuntalam: శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?

  • April 15, 2023 / 05:06 PM IST

సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. డైరెక్టర్ గుణశేఖర్‌ ఈ చిత్రానికి దర్శకతవం వహించాడు. మహా కవి కాళిదాసు ఐదవ శతాబ్దంలో రచించిన అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. నీలిమ గుణ, దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.. ఈ సినిమా ద్వారా మలయాళ నటుడు దేవ్ మోహన్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 14న తెలుగు, తమిళ, కన్నడ,మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

ఈ నేపద్యంలో సమంత తన సోషల్ మీడియా ఖాతాలో తన కన్నా ముందు శకుంతల పాత్రను పోషించిన నటీమణులకు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. మరి సమంతాకన్నా ముందు శకుంతల పాత్రలో వివిధ భాషలలో నటించి, ఆకట్టుకున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

1. డోరతి కింగ్డన్ – శకుంతల:

సుచేత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన శకుంతల సినిమాలో ‘డోరతి’శకుంతలగా నటించారు.1920 లో వచ్చిన ఈ చిత్రం హిందీలో తెరకెక్కింది.

2. కమలాబాయి – శకుంతల:

సర్వోత్తం బాదామి దర్శకత్వం వహించిన శకుంతల తెలుగు చిత్రంలో కమలాబాయి శకుంతల పాత్రలో నటించారు. ఈ చిత్రం 1932 లో రిలీజ్ అయ్యింది.

3. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి – శకుంతలై

తమిళంలో ఎల్లిస్ ఆర్ దుంగన్ దర్శకత్వం వహించిన శకుంతలై సినిమాలో MS సుబ్బులక్ష్మి శకుంతలగా నటించారు. ఈ చిత్రం 1940 లో విడుదల అయ్యింది.

4. జయశ్రీ – శకుంతల

హిందీలో వి శాంతారామ్ దర్శకత్వంలో తెరకెక్కిన శకుంతల సినిమాలో జయశ్రీ శకుంతల పాత్రలో నటించారు.ఈ చిత్రం 1943 లో రిలీజ్ అయ్యింది.

5. సంధ్య – శకుంతల

హిందీలో వి శాంతారాం దర్శకత్వంలో వచ్చిన స్త్రీ అనే సినిమాలో సంధ్య శకుంతలగా నటించారు. ఈ చిత్రం 1961 లో రిలీజ్ అయ్యింది.

6.కేఆర్ విజయ – శకుంతల

మలయాళంలో కుంచాకో దర్శకత్వంలో తెరకెక్కిన శకుంతల సినిమాలో కేఆర్ విజయ శకుంతలగా నటించారు. ఈ చిత్రం 1965 లో విడుదల అయ్యింది.

7. బి సరోజాదేవి – శాకుంతల

తెలుగులో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన శాకుంతల సినిమాలో బి సరోజాదేవి శకుంతలగా నటించారు.ఈ చిత్రం 1966 లో రిలీజ్ అయ్యింది.

8. జయప్రద – కవిరత్న కాళిదాస

కన్నడలో రేణుకా శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కవిరత్న కాళిదాస చిత్రంలో జయప్రద శకుంతలగా ఆకట్టుకున్నారు. ఈ చిత్రం 1983 లో విడుదల అయ్యింది.

9. పాయల్ శెట్టి – శాకుంతలం ఓటీటీ మూవీ

సంస్కృతం లో దుష్యంత్ శ్రీధర్ దర్శకత్వం వహించిన శాకుంతలం (Shaakuntalam) చిత్రంలో పాయల్ శెట్టి శకుంతల పాత్రలో నటించారు. ఈ 2021లో ఓటీటీలో విడుదల అయ్యింది.

10. సమంత – శాకుంతలం

గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత శకుంతలగా నటినంచిన చిత్రం ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదలైంది.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus