Jagan, Chiranjeevi: ఆ హీరోలతో జగన్ ను కలవనున్న మెగాస్టార్!
February 9, 2022 / 10:39 AM IST
|Follow Us
ఏపీలో తగ్గించిన టికెట్ రేట్ల వల్ల పెద్ద సినిమాల నిర్మాతలు ఎక్కువ మొత్తంలో నష్టపోతున్నారు. బీ, సీ సెంటర్లలో టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉండటంతో థియేటర్ల నిర్వహణ థియేటర్ల యజమానులకు భారంగా మారింది. చిరంజీవి గత నెల 14వ తేదీన సీఎం జగన్ ను కలిసి టికెట్ రేట్ల సమస్య గురించి చర్చించిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ టికెట్ రేట్ల విషయంలో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని చిరంజీవి వెల్లడించారు.
ఈ నెల 10వ తేదీన చిరంజీవి మరోసారి సీఎం జగన్ ను కలవనుండగా చిరంజీవితో పాటు స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లనున్నారని సమాచారం అందుతోంది. రాబోయే నాలుగు నెలల్లో చిరంజీవి నటించిన ఆచార్య సినిమాతో పాటు ప్రభాస్ రాధేశ్యామ్, ఎన్టీఆర్ చరణ్ ఆర్ఆర్ఆర్, మహేష్ సర్కారు వారి పాట సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ రీజన్ వల్ల స్టార్ హీరోలు మహేష్, ప్రభాస్, తారక్ జగన్ ను కలవడానికి ఆసక్తి చూపించారని సమాచారం.
పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై పలు సందర్భాల్లో విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ సమావేశానికి ఆయన దూరంగా ఉన్నారు. చిరంజీవి, చరణ్ ఒకే కుటుంబం కావడంతో చరణ్ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం లేదని సమాచారం. మరోవైపు బన్నీ సినిమాలేవీ రాబోయే ఆరు నెలల్లో రిలీజ్ కావడం లేదు. చిరంజీవి ఈ సమావేశంలో టికెట్ రేట్లతో పాటు ఇతర టాలీవుడ్ సమస్యలను కూడా చర్చించనున్నారు. నాగార్జున, రాధేశ్యామ్ మూవీ నిర్మాతలు, ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారని బోగట్టా.
త్వరలోనే టికెట్ రేట్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో చూడాల్సి ఉంది. రాధేశ్యామ్ రిలీజయ్యే నాటికి సమస్యకు పరిష్కారం లభించాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. టికెట్ రేట్లు పెరిగితే పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించే అవకాశాలు ఉంటాయి.