Actor: వాళ్లు తాచుపాము కంటే డేంజర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు..!
April 1, 2023 / 08:53 PM IST
|Follow Us
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వూ, అందులో ఆమె చేసిన కామెంట్స్ సెన్సేషన్ అవుతున్నాయి.. కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడిన పీసీకి కంగనా రనౌత్, వివేక్ అగ్నిహోత్రి వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల ద్వారా మద్దతు తెలియజేస్తున్నారు.. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయ్యిండి.. ఉన్నట్టుండి హాలీవుడ్‌కి ఎందుకు మారాల్సి వచ్చిందోననే ఆసక్తికర విషయాలను రీసెంట్గా షేర్ చేసుకుంటూ.. హిందీ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రియాంక.. ‘బాలీవుడ్లో కొందరు నన్ను ఓ మూలకు నెట్టేయాలని చూశారు..
నాకు ఆఫర్స్ రాకుండా చేయడానికి ఓ గ్రూప్ ఫామ్ అయింది.. అందులో భాగంగా నాకు కొందరితో విబేధాలు వచ్చాయి.. ఆ రాజకీయాలు నేను భరించలేక హాలీవుడ్‌కి వచ్చేశాను’ అని చెప్పింది.. దీనికి కారణం కరణ్ జోహార్ అంటూ కంగనా సంచలన ఆరోపణలు కూడా చేసింది.. అయితే హిందీ ఇండస్ట్రీలోని రాజకీయాల గురించి.. వాటికి తాను కూడా బలైపోయానంటూ బాలీవుడ్ సీనియర్ యాక్టర్ శేఖర్ సుమన్ ఆవేదన వ్యక్తం చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది..
పరిశ్రమలో పాలిటిక్స్ చేసే వారు తాచుపాము కంటే డేంజర్ అంటూ ఫైర్ అయ్యారాయన.. ‘‘ప్రియాంక చోప్రా వ్యాఖ్యలు నన్నేం షాక్‌కి గురిచేయలేదు.. చిత్ర సీమలో ఎలాంటి కుళ్లు రాజకీయాలుంటాయో అందరికీ తెలుసు.. మిమ్మల్ని అణిచివేసి, అంతం చేసేవరకు వదిలి పెట్టరు.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో జరిగింది ఇదే.. దాన్ని తట్టుకోవాలి, లేదంటే వదిలెయ్యాలి.. ప్రియాంక బాలీవుడ్ వదిలేసి మంచి పని చేసింది.. హాలీవుడ్లో భారత్ తరపునుంచి గ్లోబల్ ఐకాన్‌గా నిలిచింది’’ అంటూ ట్వీట్ చేశారు..
అలాగే మరో ట్వీట్లో.. ‘‘ఇండస్ట్రీలో ఉన్న ఓ నలుగురు వ్యక్తులు (Actor) నాకు, నా కొడుకు అధ్యాయన్‌కు అవకాశాలు రాకుండా చేశారు.. మాకు వ్యతిరేకంగా పని చేసి ఎన్నో ప్రాజెక్టుల నుండి తప్పించారు.. మమ్మల్ని ఇండస్ట్రీలో లేకుండా చెయ్యాలని చూశారు.. ఈ గ్యాంగ్ స్టర్లు తాచుపాము కంటే ప్రమాదకరమైన వాళ్లు.. కానీ అసలు నిజం ఏంటంటే వాళ్లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మమ్మల్ని ఆపలేరు’’ అని పేర్కొన్నారు..
I know of atleast 4ppl in the industry who have ganged up to have me n adhyayan removed from many projects.i know it for sure.These ‘gangsters’ have a lot of clout and they are more dangerous than a rattle snake.But the truth is they can create hurdles but they cannot stop us.