Balakrishna: ఈ రెండు ఘటనల వల్ల బాలయ్యపై నెగిటివిటీ పెరిగిందా?
January 26, 2023 / 10:01 AM IST
|Follow Us
స్టార్ హీరో బాలకృష్ణ గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్నా ఆ వివాదాలు చిన్న వివాదాలే కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రాలేదు. కొన్ని సందర్భాల్లో బాలయ్య నెగిటివ్ కామెంట్లు వస్తే క్షమాపణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బాలయ్య మార్కెట్ రెట్టింపు అయిన సంగతి తెలిసిందే. అన్ స్టాపబుల్ షో కూడా నటుడిగా బాలకృష్ణ స్థాయిని పెంచింది. బాలయ్య త్వరలో హ్యాట్రిక్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్న తరుణంలో ఊహించని విధంగా బాలయ్యపై ట్రోల్స్ వస్తున్నాయి.
హనీరోజ్ తో బాలయ్య మద్యం తాగుతూ ఇచ్చిన ఫోజుల గురించి సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. ఈ నెగిటివ్ కామెంట్లను ఫ్యాన్స్ మరవక ముందే అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసిన కామెంట్లు సగటు సినీ అభిమానుల మనస్సులను సైతం గాయపరిచాయి. వరుసగా చోటు చేసుకున్న రెండు ఘటనల వల్ల బాలయ్య ఇమేజ్ డ్యామేజ్ అయితే అయింది. అయితే బాలయ్య మీడియా ముందుకు వచ్చి తాను కావాలని అనలేదని చెప్పినా ఈ వివాదం సద్దుమణిగే అవకాశం ఉంది.
ఈ వివాదాన్ని పెద్దది చేయాలని అక్కినేని హీరోలు సైతం అనుకోవడం లేదు. బాలయ్య ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తు ఇంటర్వ్యూలలో ఈ వివాదం గురించి నోరు విప్పే ఛాన్స్ ఉంది. ఈ వివాదం వల్ల బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకు అక్కినేని హీరోలు వచ్చే అవకాశం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం అని ఆయన కావాలని ఈ కామెంట్లు చేయలేదని కొంతమంది ఫ్యాన్స్ చెబుతున్నారు.
బాలయ్య క్లారిటీ ఇస్తే సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ ఆగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ట్రోల్స్ బాలయ్య కెరీర్ పై ఏ మాత్రం ప్రభావం చూపవని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.