అలా చేయడం వల్లే హీరో నానికి వరుస విజయాలు దక్కుతున్నాయా?

  • May 1, 2023 / 08:50 AM IST

బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ ను అందుకున్న హీరోలలో నాని ఒకరనే సంగతి తెలిసిందే. టైర్2 హీరోలలో ప్రస్తుతం నాని నంబర్1 ప్లేస్ లో ఉన్నారు. నాని రెమ్యునరేషన్ 22 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా సినిమా సినిమాకు నాని మార్కెట్ పెరుగుతోంది. మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నానికి ఈ మధ్య కాలంలో వరుస విజయాలు దక్కుతున్నాయి. అయితే తన సినిమాలలో హీరోయిన్ల ఎంపిక విషయంలో వచ్చిన మార్పే నానికి ప్లస్ అవుతోంది.

నాని తన సినిమాలలో క్రేజ్ ఉన్న హీరోయిన్లు నటించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విధంగా క్రేజ్ ఉన్న హీరోయిన్లు నటించడం వల్ల సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరగడంతో పాటు నాని సినిమాలకు అన్ని విధాలుగా ప్లస్ అవుతోంది. మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా తర్వాత దేవదాస్ సినిమా మినహా మిగతా సినిమాలలో పెద్దగా గుర్తింపు లేని హీరోయిన్లు నానికి జోడీగా నటించారు.

ఆ సమయంలో నాని సినిమాలు సైతం షాకింగ్ ఫలితాలను సొంతం చేసుకున్నాయి. అయితే శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి రూట్ మార్చిన నాని మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో పాటు కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. నాని చేసిన కొన్ని కామెంట్లు వివాదాస్పదం అవుతున్నా నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. నాని తర్వాత సినిమాలో మృణాల్ ఠాకూర్, శృతి హాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ ఇద్దరు హీరోయిన్లు క్రేజ్ ఉన్న హీరోయిన్లు కావడంతో పాటు సలార్ విడుదలైన తర్వాత ఈ సినిమా విడుదలవుతూ ఉండటం నాని సినిమాకు ప్లస్ కానుంది. నాని, శృతి హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. నాని తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బ్లాక్ బస్టర్ హిట్లను సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా సినిమాకు నానికి క్రేజ్ పెరుగుతోంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus