Tollywood: ఆ ఒక్క తప్పు వల్లే టాలీవుడ్ నిర్మాతలు నష్టపోతున్నారా?
July 1, 2022 / 03:11 PM IST
|Follow Us
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలకు హిట్టైన సినిమాలకు లక్షల్లో లాభాలు వస్తుంటే ఫ్లాపైన సినిమాలకు కోట్లలో నష్టాలు వస్తున్నాయి. ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని చాలామంది నిర్మాతలు భావిస్తున్నారు. అయితే హీరోలు, దర్శకులు రెమ్యునరేషన్లను తగ్గించుకుంటే బెటర్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం డిమాండ్ చేస్తుండగా దర్శకులు 20 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం డిమాండ్ చేస్తున్నారు.
హీరోయిన్లు 2 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు తమ రేంజ్ కు అనుగుణంగా రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. ఈ విధంగా సినిమా షూటింగ్ కు వెళ్లకముందే నిర్మాతలకు 80 కోట్ల రూపాయల నుంచి 120 కోట్ల రూపాయల వరకు భారం పడుతోంది. సినిమా కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా బడ్జెట్ 150 నుంచి 200 కోట్ల రూపాయలకు పెరిగి సినిమాలు బ్రేక్ ఈవెన్ కావడం కష్టమవుతోంది.
సినిమా రిలీజైన తర్వాత హీరోలు, దర్శకులు సినిమా హిట్టైతే లాభాలు, ఫ్లాపైతే నష్టాలు పంచుకునే దిశగా నిర్మాతలు అడుగులు వేస్తే ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నిర్మాతలు ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది. స్టార్ ప్రొడ్యూసర్లు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇండస్ట్రీకి మరింత కష్టకాలం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదే సమయంలో మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా నిర్మాతలు సినిమాలను తెరకెక్కిస్తే మాత్రమే ఈ పరిస్థితి మారే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
టాలీవుడ్ నిర్మాతలు ఈ నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో సినిమాల నిర్మాణం అంతకంతకూ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఏడాది రిలీజైన సినిమాలలో హిట్టైన సినిమాలతో పోల్చి చూస్తే ఫ్లాపైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.