Kalki 2898 AD: కమల్ హాసన్ ‘నిడివి’… సినిమా క్లైమాక్స్ కార్డు ఏంటో చెప్పేస్తోందా?
May 22, 2024 / 01:04 PM IST
|Follow Us
ఒక సినిమా రెండు పార్టులుగా వస్తుంది అని చెప్పడానికి మనకు రెండు దారులు ఉన్నాయి. అందులో ఒకటి సినిమా క్లైమాక్స్‌లో అంటే ఎండ్ టైటిల్ కార్డ్స్ దగ్గర ‘ఈ సినిమాకు సీక్వెల్ ఉంది’ అని అర్థం వచ్చేలా ఓ బ్యానర్ వేయడం. ఇక రెండోది సినిమా టీమ్ ముందే అనౌన్స్ చేసేయడం. ఈ వ్యవహారం సులభంగా అర్థం కావాలంటే ఒకటి ‘బాహుబలి’ (Baahubali), ‘పుష్ప’ (Pushpa: The Rise) స్టైల్.. సినిమా షూటింగ్ టైమ్‌లోనే చెప్పేశారు. రెండోది ‘కల్కి’ స్టయిల్.
అదేంటి ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా రెండు పార్టులు ఉంటుందనే విషయం చెప్పలేదు కదా అంటారా. అవును మీరు అన్నది నిజమే. సినిమా క్లైమాక్స్‌లో అదేనండీ ఎండ్ కార్డ్‌లో రెండో పార్టు గురించి చెబుతారట. మామూలుగా అయితే ఈ విషయం టీమ్ ఎక్కడా మాట్లాడటం లేదు కానీ.. కమల్ హాసన్ (Kamal Haasan) పాత్ర గురించి జరుగుతున్న చర్చలు చూస్తుంటే మాత్రం అదే అనిపిస్తోంది.
కావాలంటే మీరే చూడండి.. కమల్ హాసన్ పాత్ర నిడివి ‘కల్కి 2898 ఏడీ’లో కేవలం 20 నిమిషాలే ఉంటుంది అని చెబుతున్నారు. అలా అని అంతేనా అంటే.. కాదు కాదు రెండో పార్టులో 90 నిమిషాలు కనిపిస్తాడు అని కూడా అంటున్నారు. ఆ లెక్కన ‘కల్కి 2898 ఏడీ’ రెండు పార్టులుగా రావడం పక్కా అని చెబుతున్నారు సినిమా విశ్లేషకులు. సినిమా ప్రచారానికి టీమ్ బయటకు వస్తే కచ్చితంగా ఈ ప్రశ్న వాళ్లకు ఎదురవుతుంది.
ఆ మాటకు వాళ్ల ఆన్సర్ కూడా మనం ఊహించేయొచ్చు. ‘తినబోతు రుచి ఎందుకు? సినిమా రిలీజ్ అయ్యాక మీకే తెలుస్తుంది’ అని అంటారు. చూద్దాం ఊహించని సినిమాలు చేసే నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఊహించని ఆన్సర్ ఏమన్నా ఇస్తారేమో. ఇక వైజయంతి మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. జూన్ 27న సినిమాను రిలీజ్ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ప్రచారం జూన్ 4 తర్వాత జోరందుకునే ఛాన్స్ ఉందట.