హౌస్ ఫుల్ బోర్డులతో తెలుగు థియేటర్లు.. ఆ రేంజ్ కలెక్షన్లు సాధ్యమంటూ?
January 13, 2024 / 12:32 PM IST
|Follow Us
సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటు తెలుగులో అటు తమిళంలో భారీ సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్నాయి. తమిళంలో కెప్టెన్ మిల్లర్, అయలాన్ సినిమాలు విడుదల కాగా తెలుగులో హనుమాన్, గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమాలు భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్నాయి. అయితే తమిళనాడులో విడుదలైన కెప్టెన్ మిల్లర్, అయలాన్ సినిమాలకు సరైన ఓపెనింగ్స్ రాలేదు.
బాలీవుడ్ లో మెర్రీ క్రిస్మస్ రిలీజ్ కాగా ఈ సినిమాకు సైతం ఆశించిన రేంజ్ లో బుకింగ్స్ జరగడం లేదు. మరోవైపు హనుమాన్ సినిమాకు నార్త్ బెల్ట్ లో సైతం పాజిటివ్ టాక్ వచ్చింది. అక్కడ కూడా ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని సినిమాలు పాజిటివ్ టాక్ తో ప్రదర్శించబడటంతో పాటు మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి.
నా సామిరంగ (Naa Saami Ranga) మూవీ తెలుగు రాష్ట్రాల్లో 300 థియేటర్లలో రిలీజ్ కానుంది. సినిమాల టాక్ ఆధారంగా సోమవారం నుంచి స్వల్పంగా థియేటర్ల కేటాయింపులో మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. టాలీవుడ్ సినిమాలకు సంక్రాంతి సీజన్ ముఖ్యమైన సీజన్ అనే సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాలు కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్నాయి.
ఈ సంవత్సరం కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సంక్రాంతి సినిమాల ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి. ఈ నెల 19వ తేదీ వరకు సంక్రాంతి సినిమాలు పండుగ సెలవులను క్యాష్ చేసుకోనున్నాయి. సంక్రాంతి సినిమాలు ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కాయనే సంగతి తెలిసిందే.