బి.గోపాల్ కాదు… అంతకు ముందే ఫ్యాక్షన్ సినిమా వచ్చింది.. అదేంటంటే..?
May 27, 2020 / 08:00 AM IST
|Follow Us
ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు అనగా మనకి ‘సమరసింహా రెడ్డి’ ‘నరసింహ నాయుడు’ ‘ఆది’ ‘ఇంద్ర’ వంటి సినిమాలు గుర్తొస్తుంటాయి. కాబట్టి దర్శకుడు బి.గోపాలే ఈ ట్రెండ్ ను మొదలుపెట్టాడు అని అంతా అనుకుంటూ ఉంటారు.కానీ వీటికి ముందే వెంకటేష్ నటించిన ‘ప్రేమించుకుందాం రా’ అనే చిత్రం వచ్చింది. అది కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మొదటి చిత్రం అనుకుంటే పొరపాటే. ఆ చిత్రం కంటే చాలా సంవత్సరాల ముందే ఓ చిత్రం … ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది.
అదే ‘కడప రెడ్డెమ్మ’. శారద గారు ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం మొదటి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. రంజిత, ఆనంద్ లు ప్రధాన హీరో హీరోయిన్ లు గా నటించారు.సీమలో ప్రేమలు, పెళ్ళిళ్ళకు అక్కడి జనం అతీతం.కానీ వారి కట్టుబాట్లను పక్కన పెట్టి … ఓ జంట లేచిపోయి పెళ్ళి చేసుకుంటారు. కొన్నాళ్ళ తరువాత మళ్ళీ ఊరికి వస్తారు. అలా తిరిగి వచ్చిన ఆ జంటను కుల భేదాలతో కళ్ళు మూసుకుపోయిన పెద్దలు వారిని హతమారుస్తారు.
దాంతో వారి పై పాగా తీర్చుకునే పాత్రలో శారద గారు కనిపిస్తారు. నెగిటివ్ రోల్ లో మోహన్ బాబు కూడా కనిపిస్తారు. తమ్మారెడ్డి భరధ్వాజ్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా చలపతి రావు నిర్మాత కావడం విశేషం. కాన్సెప్ట్ పరంగా ఓకే అనిపించినా.. పాటలు పెట్టి విసికించారు అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఓసారి చూడదగ్గ చిత్రమే. ఫ్యాక్షన్ సినిమాల వైపు మొదటి అడుగు పడేలా చేసిన చిత్రం ఇది.