Trisha: అందం పెంచుకోవడం కోసం త్రిష ఇంజక్షన్లు ఉపయోగించేదా?
July 31, 2023 / 07:54 PM IST
|Follow Us
సౌత్ ఇండియా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ హీరోయిన్ త్రిష ఒకరు. ఈమె ప్రస్తుత నాలుగుపదుల వయసులో ఉన్నప్పటికీ హీరోయిన్ గానే అవకాశాలు అందుకుంటున్నారు. ఈమెతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన వారందరూ కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా స్థిరపడినప్పటికీ త్రిష మాత్రం హీరోయిన్ గా వరుస సినిమా అవకాశాలను అందుకుంటు ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైనటువంటి త్రిష తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఈమె (Trisha) తన సెకండ్ ఇన్నింగ్స్ లో రెట్టింపు అందంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు నాలుగుపదుల వయసులో కూడా త్రిష ఇంత అందంగా ఉండటానికి కారణం ఏంటి అసలు ఈమె అందం వెనుక ఉన్న రహస్యం ఏంటి అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. త్రిష ఇంత అందంగా ఉండడానికి కారణం ఆమె ఉపయోగించే మెడికల్ ప్రొడక్ట్స్ అని తెలుస్తోంది.
ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగాలి అంటే అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇలా అందాన్ని కాపాడుకోవడం కోసం చాలామంది సహజసిద్ధంగా యోగా వంటి వాటిని చేస్తూ అందాన్ని రెట్టింపు చేసుకోగా కొందరు మాత్రం సర్జరీలు మెడికల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ అందాన్ని పెంచుకుంటారు. ఈ క్రమంలోనే త్రిష కూడా తన అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం మెడికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించడమే కాకుండా ఇంజక్షన్ కూడా వేయించుకునే వారట.
ఇలా అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం త్రిష ఇంజక్షన్స్ ఉపయోగిస్తున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు.అయితే ఈ ప్రొడక్ట్స్ ఇంజక్షన్స్ కారణంగా ప్రస్తుతం ఈమె అందంగా కనిపించినప్పటికీ భవిష్యత్తులో ఇది ప్రమాదకరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా త్రిష మాత్రం రెట్టింపు అందంతో వరుస అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.