టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఓ సినిమాకు రీమేక్ చేయాలి? అనే ప్రశ్న వేస్తే సినిమా జనాలు చెప్పే లిస్ట్‌లో కచ్చితంగా ఉండే పేరు (Vikramarkudu) ‘విక్రమార్కుడు’. రవితేజ(Ravi Teja) – రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ విజయం అందుకుంది. కమర్షియల్ సినిమాకు ఓ అర్థంలా నిలిచిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని, ఈ మేరకు ఓ దర్శకుడు సినిమా చేయడానికి రెడీ అయ్యారని కూడా వార్తలొచ్చాయి. తొలి సినిమా కథ రాసిన విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) రెండో సినిమా కథ సిద్ధం చేస్తున్నారని కూడా అన్నారు. అయితే ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేదు.
రీసెంట్గా ఈ సినిమా గురించి ప్రముఖ నిర్మాత (K. K. Radhamohan) కె.కె.రాధామోహన్ వివరాలు వెల్లడించారు. ఎందుకంటే ‘విక్రమార్కుడు 2’ సినిమా నిర్మించాలని అనుకున్నది, సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసింది ఆయనే కాబట్టి. ‘విక్రమార్కుడు’ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ స్క్రిప్టులో భాగం అయినా.. ఇంకా ఈ సీక్వెల్ పట్టాలెక్కడం లేదు. దీంతో ‘ఏమైంది విక్రమార్కుడు 2’కి రాధామోహన్‌ను అడిగితే… ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆ సినిమా ఎందుకు ముందుకురావడం లేదో క్లియర్‌గా చెప్పేశారు. దీంతో రవితేజకు ఏమైంది అనే ప్రశ్న మొదలైంది.
‘విక్రమార్కుడు’ సినిమా సీక్వెల్ సబ్జెక్ట్ రెడీగా ఉందట. అలాగే ‘విక్రమార్కుడు 2’ అనే టైటిల్ కూడా ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించారు. అయితే సమస్యంతా ఆర్టిస్టుల దగ్గరే ఉందట. రవితేజ ఈ సినిమా విషయంలో ఆసక్తిగా లేరట. దీంతో ఆయన్ను ముందు ఒప్పించాలి అని రాధా మోహన్ అంటున్నారు. ఇక దర్శకుడు (Sampath Nandi) సంపత్ నంది ఈ సినిమాను హ్యాండిల్ చేయడానికి ఆసక్తితో ఉన్నారట. అయితే ఆయన ఇప్పుడు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
అలాగే రవితేజ చేయకుండా ‘విక్రమార్కుడు 2’ ఉండదు అని అంటున్నారు రాధా మోహన్. సరైన కాంబినేషన్ కుదరకుండా ‘విక్రమార్కుడు 2’ సినిమాను నిర్మించే ఆలోచన లేదని తేల్చి చెప్పేశారు. దీంతో ఏం జరుగుతుందా అని సినీ గోయర్స్ అనుకుంటున్నారు. వస్తే బాగుండు అనేది వారి కోరిక.
భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!