“బ్రహ్మోత్సవం”లో సూపర్ సీన్ ఇదే!!!

  • May 17, 2016 / 11:08 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నిర్మిస్తూ నటిస్తున్న చిత్రం “బ్రహ్మోత్సవం”. ఈ సినిమా మంచి కుటుంభ  కధా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తానుంది. వచ్చే 20న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దం అవుతుంది. అయితే అదే క్రమంలో ఈ సినిమాకు ఓ రేంజ్లో ప్రమోషన్స్ ఇస్తూ…భారమంతా తన మీదే వేసుకున్నాడు మహేష్ బాబు. ఇదిలా ఉంటే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హైలైట్ సీన్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందులో ఇప్పటికే మనం కొన్ని సీన్స్ ను విన్నాం, వాటిల్లో ఆడియో రిలీజ్ నాడు జయసుధ మాట్లాడుతూ సినిమా క్లైమాక్స్ లో మహేష్ అద్భుతంగా చేసి ఏడిపించాడని చెప్పేశారు, అంటే దీన్ని బట్టి చూస్తే సినిమాలో సెంటిమెంట్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి అని తెలిసిపోతుంది.

అదే క్రమంలో ఈ చిత్రానికి కెమెరామన్ గా చేస్తున్న రత్నవేలు మీడియాకు ఇచ్చిన ఇంటెర్వ్యు లో ఈ సినిమా ఇంటేర్వెల్ సీన్ దుమ్ము దులిపేస్తుంది అని ఇప్పటికే చెప్పేసాడు ఇక ఇంటేర్వెల్ హిట్ అన్న మాట. ఇప్పుడు మరో హైలైట్ సీన్స్ గురించి సాక్షాత్తూ ప్రిన్స్ చెప్పేసాడు….ఆయన మాట్లాడుతూ…ఈ సినిమాలో ఒకటంటూ కాదు అన్ని హైలెట్ సీన్స్ అని చెబుతూ.. ఒక్క సన్నివేశం తనకు తన చిన్న నాటి రోజులు గుర్తొచ్చేలా చేసిందని అన్నారు. అదేమిటంటే…హీరో తన ఫ్యామిలీ మొత్తం ఊటీ వెళ్తారట. అయితే వెళ్లేప్పుడు రైల్వే స్టేషన్ లో ట్రైన్ కోశం వెయిట్ చేసే సీన్ తనకు చిన్న నాటి రోజులు గుర్తు చేశాయని అన్నారు మహేష్ బాబు. అంతమంది ఆర్టిస్ట్ తో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభూతని చాలా విషయాలు నేర్చుకున్నానని అన్నారు. సో ఈ సీన్ సినిమాకు మరో హైలైట్ అన్న మాట…ఇలా సినిమా విడుదలకు ముందే అంచనాలను పెంచేస్తున్న సీన్స్ తెరపై ఎలా ఉంటాయో చూడాలంటే మాత్రం మరో 4 రోజులు ఆగాల్సిందే..

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus