బిగ్‌బాస్ 4: ఎంత చెప్పినా మార్పు రాని అతను బయటకు వచ్చేస్తాడా?
September 25, 2020 / 01:00 PM IST
|Follow Us
బిగ్‌బాస్ నాలుగో సీజన్లో కొంచెం సీరియస్‌నెస్ కనిపిస్తోంది. ఏదో ఇంట్లోకి వచ్చాం… కొద్ది రోజులు ఉంటాం.. వెళ్లిపోతాం… ఆఖరి వరకు ఉన్నావాళ్లు గెలుస్తారు అంటూ తొలి రెండు వారాలు ఇంటి సభ్యులు అనుకున్నట్లు కనిపించింది. అయితే మూడో వారం ‘ఉక్కు హృదయం’ టాస్క్ తర్వాత ఎవరు పరిస్థితులు మారాయి. చూసే ప్రేక్షకుల ఆలోచనలూ మారాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ శాతం బాగా మారిందని టాక్. ఎలిమినేషన్ జోన్లో ఉన్న వాళ్ల ఓట్లు టాస్క్ ముందు ఆ తర్వాత అనేలా మారింది.
ఈ వారం నామినేషన్లో మోనాల్, ఆరియానా, మెహబూబ్, లాస్య, హారిక, కుమార్ సాయి, దేవీ నాగవల్లి ఉన్నారు. వీరిలో లాస్య, దేవీ నాగవల్లి డైరెక్ట్‌గా నామినేట్ అయిన విషయం తెలిసిందే. వీరిలో ఇంట్లో యాక్టివ్‌గా ఉన్నవా ళ్లు చూస్తే లాస్య, హారిక, దేవీ నాగవల్లి, మోనాల్ మాత్రమే. మిగిలిన వాళ్లు ఫర్నీచర్‌లో కలసిపోయారనే కామెంట్లు బయట చాలానే వస్తున్నాయి. దీంతో ఈ వారం పోటీ ఈ నలుగురు మధ్యే అని తొలుత అనుకున్నారు. అయితే ఉక్కు హృదయం టాస్క్ వల్ల ఆరియానా, మెహబూబ్ కాస్త యాక్టివ్ అయ్యారు. కుమార్ సాయిలో పెద్ద మార్పేం కనిపించలేదు.
గత వారం లాగా ఈ వారం కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే గత ఎలిమినేషన్లకు భిన్నంగా ఈ సారి అందరికీ దగ్గరదగ్గరగా ఓట్లు పడ్డాయని అంటున్నారు. దీని వల్ల ఎలిమినేట్ అయ్యేవాళ్లు తక్కువ శాతం ఓటింగ్ తేడాతో బయటకు వస్తారని భోగట్టా. అయితే ఈ విషయం నాగార్జున స్టేజీ మీద చెబుతారా లేదా అనేది వేరే విషయం. ప్రైవేటు ఓటింగ్స్ ప్రకారం అయితే కుమార్‌సాయి, దేవీ నాగవల్లికి తక్కువ ఓట్లు పడ్డాయట.
కుమార్ సాయి ఇంట్లో తొలి రోజు నుంచి అంటీముట్టనట్టే ఉంటున్నాడు. దివి రోబో కిడ్నాప్ విషయంలో కూడా తప్పు తనవైపు లేదు అన్నట్లుగా నటించాడు. ఇదంతా ప్రేక్షకులు చూసే ఉంటారు. మరోవైపు దేవీ నాగవల్లి యాక్టివ్‌గా ఉన్నా… చిన్న చిన్న వాటికీ హర్ట్ అవుతోందనే కామెంట్లూ వస్తున్నాయి. అలాగే ఉక్కు హృదయం టాస్క్‌లో ఆమె రోబో చనిపోయినా.. ఇంకా యాక్టివ్‌గా రోబో టీమ్‌తో కలసి ప్లాన్స్ వేసింది. ఇదీ ప్రేక్షకులు చూసుంటారు. ఇవే కాకుండా ఇన్ని రోజుల పర్ఫార్మెన్స్ కూడా పరిగణలోకి తీసుకొని ప్రేక్షకుల ఓట్లు వేసినట్లు అర్థమువుతోంది.
ఈ వారం పర్ఫార్మెన్స్ పరిగణలోకి తీసుకొని, ప్రైవేటు ఓటింగ్స్ ఆధారంగా, ఇప్పటివరకు తెలుస్తున్న సమాచారం ప్రకారం కుమార్ సాయి, దేవీ నాగవల్లిలో ఒకరు బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది. అయితే ఆరియానా గ్లోరీ, మెహబూబ్ పేర్లు కూడా రెడ్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం వాళ్ల ప్రదర్శన వల్ల కొన్ని ఓట్లు పడ్డాయని అంటున్నారు. అయితే శుక్రవారం వారి ప్రదర్శన నచ్చితే ఫైనల్ 4 అయిన కుమార్ సాయి, దేవీ నాగవల్లి, ఆరియానా గ్లోరీ, మెహబూబ్ వరుసలో కొన్ని మార్పులు ఉండొచ్చు.