తెలుగు రాష్ట్రాల్లో ‘తొలిప్రేమ నాలుగు రోజుల కలక్షన్స్

  • February 14, 2018 / 02:44 PM IST

ఈ ప్రేమికుల రోజు వరుణ్ తేజ్ కి కలకాలం గుర్తుంటుంది. ఎందుకంటే హిట్ అనే ప్రియురాలు రెండు రోజుల ముందే అతని ఒళ్లో వాలింది కాబట్టి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ నటించిన ‘తొలిప్రేమ’ ఫిబ్రవరి 10న రిలీజ్ అయి విశేష స్పందన అందుకుంది. విడుదలయిన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతోంది. తొలిరోజే తెలుగు రాష్ట్రాల్లో 3.21 కోట్ల షేర్ వసూలు ఔరా అనిపించిన ఈ చిత్రం యుఎస్‌లో ప్రీమియర్ షోల రూపంలో హాఫ్ మిలియన్ డాలర్ మార్కును దాటింది. ఆ జోరు అలాగే కొనసాగుతోంది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 25.8 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. ఇది వరుణ్ తేజ్ కెరీర్ లోనే బెస్ట్ కలక్షన్స్. షేర్ (14.6 కోట్లు) కూడా ఎక్కువగానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులకి తొలిప్రేమ 10.77 కోట్ల షేర్ వసూలు చేసింది. ఏరియాల వారీగా కలక్షన్స్ ..

ఏరియా వసూళ్లు
నైజాం : 4.08 కోట్లు
సీడెడ్ : 1.33 కోట్లు
ఉత్తరాంధ్ర : 1.53 కోట్లు
ఈస్ట్ గోదావరి : 0.90 కోట్లు
వెస్ట్ గోదావరి : 0.73 కోట్లు
కృష్ణ : 0.89 కోట్లు
గుంటూరు : 0.94 కోట్లు
నెల్లూరు : 0.34 కోట్లు
మొత్తం : 10.77 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus