స్పైడర్ లో హైలెట్ కానున్న ఈ సీన్లు!

  • September 21, 2017 / 09:29 AM IST

కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘స్పైడర్’ సెన్సార్ పూర్తి చేసుకొని ఈ నెల 27 న రిలీజ్ కి ముస్తాబవుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై  ఎన్.వి.ప్రసాద్ నిర్మించిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో ఆడియన్స్ ని ఆశ్చర్య పరిచే మూడు హైలెట్ సీన్స్ ఉన్నాయని తెలిసింది. ఆ సన్నివేశాలు  హై విజువల్ ఎఫెక్ట్స్‌తో నిండి అద్భుతంగా ఉంటాయని సమాచారం. ఇదివరకు ఏ తెలుగు చిత్రంలో ఇలాంటి సీన్లు చూసి ఉండరని చిత్ర బృందం ధీమాగా వ్యక్తం చేసింది.

ట్రైలర్‌లో చూపించిన.. రోడ్డుపై బండరాయి దొర్లుతూ వచ్చి కార్లు, ఇతర వాహనాలను విధ్వంసం చేసే సీన్ ఒకటయితే.. దీనికి మించిన సీన్ మరొకటి ఉందని వెల్లడించింది. పైగా మురుగదాస్ క్లైమాక్స్ ని రియాల్టీ షో గా మలిచి తెరకెక్కించారని, ఇది అందరినీ ఆకట్టుకుందని నమ్మకంతో యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మహేష్ ఇంటలిజన్స్ ఆఫీసర్ గా కనిపించనున్న ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య రొమాన్స్ గిలిగింతలు పెట్టనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus