ముగ్గురు హీరోలు పక్కన పెట్టిన స్టోరీని ఇష్టపడ్డ అల్లు అర్జున్!

  • October 16, 2017 / 04:03 PM IST

ఒక హీరో వద్దన్న కథను మరో హీరో చేయడం సినీ పరిశ్రమల్లో సహజం. అటువంటి కథలు సూపర్ హిట్ అయిన సందర్భాలు తెలుగు చిత్రపరిశ్రమలో అనేకం ఉన్నాయి. అయితే ఒకరిద్దరు నో చెబితే.. ఆ స్టోరీని వినడానికి కూడా చాలామంది ఒప్పుకోరు. అటువంటిది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు నో చెప్పిన కథకు ఒకే చెప్పారు అల్లు అర్జున్. ఇది ఇప్పటి మాట కాదు. గంగోత్రి సినిమా తర్వాత ఏ సినిమా చేయాలనీ ఆలోచిస్తుండగా సుకుమార్ చెప్పిన లవ్ స్టోరీ ఆర్య కి ఒకే చెప్పారు.

ఈ కథను సుకుమార్ మొదట రవితేజ కు చెప్పారు. “కథ బాగుంది, కానీ నాకు కరెక్ట్ కాదు” అని ఆ కథను సున్నితంగా తిరస్కరించారు. తర్వాత ఈ కథ నితిన్ దగ్గరకు వెళ్ళింది. నితిన్ కూడా నో చెప్పడంతో ప్రభాస్  దగ్గరకు వెళ్ళింది. ప్రభాస్ కూడా ఆర్య తనకి సూట్ కాదని చెప్పేసాడంట. చివరగా అల్లు అర్జున్ ఒకే చెప్పారు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాతో బన్నీ హీరోగా నిలదొక్కుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus