తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి వస్తుందంటే పల్లెటూళ్లు కొత్త కళను సంతరించుకుంటాయి. కొత్తగా పెళ్లైన కూతుళ్లు అల్లుళ్లతో…ఉద్యోగం కోసం నగరవాసం చేసే కొడుకులు మిత్రులతో సొంతూరికి చేరిపోతారు. కుటుంబాల పండుగగా చెప్పుకొనే సంక్రాంతి పండుగలో సినిమా అనేది ఒక భాగం. పండుగ మూడు రోజులలో ఏదో ఒక రోజు ఇంటిల్లిపాది సినిమాకు వెళ్లడం ఒక సరదా. అందుకే ఈ సీజన్ లో విడుదలైన ఒక మోస్తరు సినిమాలు కూడా రెట్టింపు వసూళ్లు దక్కించుకుంటాయి. అలాగే రెండు మూడు పెద్ద సినిమాలు విడుదలైనా.. అన్నిటికీ ఆదరణ దక్కుతుంది. అందుకే ఈ డిమాండ్ ని డిస్ట్రిబ్యూటర్స్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
కాగా సంక్రాంతి సినిమాల టికెట్ రేట్లు భారీగా పెంచేశారు అని సమాచారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో చిత్రాల టికెట్ ధర మాక్సిమమ్ 250 రూపాయలు, మినిమమ్ 100రూపాయలుగా ఉందని తెలుస్తుంది. సింగిల్ స్క్రీన్ లలో ఈ చిత్రాల టికెట్ ధరలు 200 రూపాయల నుండి 80వరకు పలుకుతుందని సమాచారం.ఇక రజిని దర్బార్, కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా చిత్రాల టికెట్ ధర కూడా 150 నుండి 200 వరకు పెంచేశారని వినికిడి. ఈ ఈ స్థాయిలో టికెట్ రేట్లు ఉన్న పక్షంలో ఐదుగురు సభ్యులు ఉన్న ఓ కుటుంబం థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలన్నా 1500 నుండి 2000 రూపాయల ఖర్చు అవుతుంది. కుటుంబం సమేతంగా ఏడాదికి ఒకసారి సినిమా చూడలన్న ప్రేక్షకుల ఆశలకు భారీగా పెరిగిన టిక్కెట్ ధరలు గండికొడుతున్నాయి.
ప్రస్తుత టికెట్ ధరల రీత్యా…సంక్రాంతికి వచ్చే పెద్ద చిత్రాలలో రెండు మూడు సినిమాలు చూడాలని ఆశపడిన ప్రేక్షుకులు, హిట్ టాక్ వచ్చిన ఏదో ఒక సినిమాకు పరిమితమయ్యే అవకాశం ఉంది. భారీ ధరలు చెల్లించి సినిమాలు కొన్న డిస్ట్రిబ్యూటర్స్ టికెట్ ధరలు తగ్గించలేని పరిస్థితి. స్టార్ హీరోల బడ్జెట్ లో దర్శకుడు మరియు హీరో రెమ్యూనరేషన్స్ కొరకే 30 నుండి 40శాతం పోతుంది.కాబట్టి టికెట్ ధరలు తగ్గాలంటే వీరు రెమ్యూనరేషన్ తగ్గించుకోవడమే.
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!