Tiger Nageswara Rao: ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • October 20, 2023 / 02:09 PM IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. యంగ్ డైరెక్టర్ వంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఆయన ‘కార్తికేయ 2 ‘ ‘ది కశ్మీర్ ఫైల్స్’ వంటి పాన్ ఇండియా హిట్లతో మంచి ఫామ్లో ఉన్న నిర్మాత. స్టూవర్టుపురం గజదొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథతో ఈ సినిమా రూపొందింది. టైగర్ నాగేశ్వరరావు గురించి చాలా మంది కథలు కథలుగా వినే ఉంటారు.

ఈయన్ని రాబిన్ హుడ్ అని అంటూ ప్రశంసించే వారు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఇక రవితేజ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రమిది. అంతేకాకుండా మొదటి బయోపిక్ అని కూడా అనొచ్చు. అక్టోబర్ 20 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 9.00 cr
సీడెడ్ 5.40 cr
ఉత్తరాంధ్ర 6.00 cr
ఈస్ట్ 2.00 cr
వెస్ట్ 1.70 cr
గుంటూరు 2.50 cr
కృష్ణా 2.00 cr
నెల్లూరు 1.06 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 29.66 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.40 cr
ఓవర్సీస్ 2.00 cr
మిగిలిన భాషల్లో 2.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 36.06 cr (షేర్)

‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) చిత్రానికి రూ.36.06 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.37 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. రవితేజ కెరీర్లో ఇదే హయ్యెస్ట్ థియేట్రికల్ బిజినెస్ చేసిన చిత్రం. ఈ టార్గెట్ ను రీచ్ అవ్వాలి అంటే స్ట్రాంగ్ పాజిటివ్ టాక్ రావాల్సి ఉంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus