అఖిల్ అరుపు… సోహైల్ మాట విరుపు… మెనాల్ సెటైర్ ఇంకా ఎన్నో…
September 21, 2020 / 06:18 PM IST
|Follow Us
బిగ్‌బాస్ నాలుగో సీజన్లో సరదా ఫేజ్ అయిపోయింది…. ఇక అంతా సీరియస్ గేమే. ఇదేదో నిన్న నాగార్జున చెప్పిన మాటను పట్టుకొని అనడం లేదు. ఈ రోజు నామినేషన్ జరిగే విధానం బట్టి చెబుతున్నాం. సీరియస్‌గా ఆడండి అంటూ నాగార్జున అన్నాడనో లేక రియల్ తత్వాన్ని చూపించాలనో ఈ రోజు పార్టిసిపెంట్స్ మంచి ఫైర్ మీద కనిపించారు. అందులోనూ నామినేషన్ డే కావడంతో అది ఇంకా ఎక్కవైంది. వాళ్ల ఫైర్‌ను చూపిచండానికి బిగ్ బాస్ ఈ రోజు ‘ఫొటో ఇన్ ఫైర్’ నామినేషన్ స్టైల్ వాడాడు.
అంటే ఎవరిని నామినేట్ చేస్తారో వాల్ల ఫొటో మంటల్లో వేయండి అని చెప్పాడు. నామినేషన్ ముందు ఎలా ఉన్నారో తెలియదు కానీ…. ఒన్స్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యాక ఒక్కొక్కరిలో కోపం తన్నుకొచ్చింది. శని, ఆదివారాల్లో జరిగినన్నీ గుర్తుకు తెచ్చుకుని, వారిని గుర్తు పెట్టుకుని మరీ ఫొటోలను మంటల్లో పడేశాడు. ఇంకేముంది ఇంటిలో మంటలు రేగాయి. అభిజీత్‌ను సుజాత నామినేట్ చేయడగా, ఆటోమేటిగ్గా సుజాతను అభిజీత్ నామినేట్ చేశాడు. నాలుగు అబద్దాల కాన్సెప్ట్‌ను తీసుకొచ్చి మోనాల్, దివి పరస్పరం నామినేట్ చేసుకున్నారు.
అయితే ‘మీరు చూడకుండా ఎలా చెబుతున్నారు’ అంటూ అఖిల్‌కు కుమార్ సాయి ఏదో చెప్పే ప్రయత్నం చేయగా, ‘ఆగు భయ్యా’ అంటూ అఖిల్ కసురుకున్నాడు. ‘నా ఇష్టం, నన్నాఫ్ యువర్ బిజినెస్’ అంటూ ఆరియానా – సోహైల్ గొడవపడ్డారు. కారణం లేకుండా తనను బయటకు పంపాలని చూసిన మెహబూబ్ ఫొటోను హారిక కాల్చేసింది. ఇక ఆటోమేటిగ్గా మెహబూబ్.. హారికను నామినేట్ చేశాడు. ఇదంతా చూస్తుంటే… ఈ రోజు నామినేషన్ ప్రక్రియ మంటలు వేడి ఎక్కువగా ఉండేలా ఉంది.