లక్కీ మీడియా సంస్థ నుంచి నెక్స్ట్ మూవీ ‘అగ్లీ స్టోరీ’ గా టైటిల్ ఖరారు

  • November 18, 2023 / 05:34 PM IST

లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ గారు కొత్త సినిమాలని ప్రేక్షకులకు అందివ్వడంలో మొదటి వరుసలో ఉంటారు. సినిమా చూపిస్త మామ, మేము వయసుకు వచ్చాం, హుషారు లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టెయినర్స్ ని నిర్మించిన బెక్కెం వేణుగోపాల్ గారు నూతన దర్శకుడు ప్రణవ స్వరూప్ చెప్పిన కథ నచ్చడంతో రియా జియా ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యానర్ తో కలసి ఒక రొమాంటిక్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నారు. అందరికి సుపరిచితుడు అయిన నందు హీరో గా నటించగా ఉయ్యాల జంపాల సినిమా తో తెలుగు తెరకి పరిచయమై సినిమా చూపిస్త మావ లాంటి చిత్రాలతో తన నటనతో తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందిన అవికా గోర్ ఈ చిత్రం లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఎంతో మంది కొత్త దర్శకులని పరిచయం చేసిన బెక్కెం వేణుగోపాల్ గారు ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి ప్రణవ స్వరూప్ అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తున్నారు. ఈ కథ గురించి బెక్కెం వేణుగోపాల్ గారు మాట్లాడుతూ ఈ కథ విభిన్నమైన పాత్రలతో ఆద్యంతం ప్రేక్షకులని కట్టిపడేసేలా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ రోజు టైటిల్ లాంచ్ జరగగా ఈ చిత్రానికి “అగ్లీ స్టోరీ” అని టైటిల్ ని నిర్ణయించారు. 2024 ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని ఈ సందర్భంగా మీడియాకి తెలిపారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus