పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడం నా డ్రీం కాదు, నా జీవిత లక్ష్యం:దిల్ రాజు

  • February 20, 2016 / 11:07 AM IST

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఏంటో మంది నిర్మాతలు, దర్శకులు ఆయన చుట్టూ తిరుగుతుంటారు.ఆయనతో ఒక్క సినిమా చేయ్యిన్చుకొంటే చాలు అనుకొనే నిర్మాతలు ఇండస్ట్రీ లో కోకొల్లలు.ఆలాంటి నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో సునీల్ హీరోగా, డింపుల్ చోపాడే, నిక్కి గల్రాని హీరోయిన్తెరకెక్కిన తాజా చిత్రం ‘కృష్ణాష్టమి’ ఈ  చిత్రం ఫిబ్రవరి 19 న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ లో భాగంగా నిర్మాత దిల్ రాజు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. పవన్ కళ్యాణ్ తో పని చేయడం నా డ్రీమ్ కాదని.., నా జీవిత లక్ష్యమని చెప్పుకొచ్చాడు.
ఇటీవలే పవన్ కళ్యాణ్ మంచి స్క్రిప్ట్ తీసుకురా.. తప్పకుండా సినిమా చేద్దామని పవన్ కళ్యాణ్ మాటిచ్చాడని.. ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్లు దిల్ రాజు తెలిపాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం అంటే మాములు విషయం కాదని, స్క్రిప్ట్ అంత నాకు నచ్చినట్లే పూర్తయిన తర్వాతే పవన్ కళ్యాణ్ కి వినిపిస్తానని,  ఆ కథ పవన్ కు నచ్చితే సినిమా పట్టాలెక్కుతుందని, సినిమా బడ్జెట్ ఎంతైనా ఫర్వాలేదని దిల్ రాజు తెలిపాడు. ఇక ‘కృష్ణాష్టమి’ చిత్రంతో పాటు మెగాహీరో సాయిధరమ్ తేజ్ తో ‘సుప్రీమ్’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నానని దిల్ రాజు తెలిపాడు.ఇక మనోడు లక్ష్యం ఎప్పుడు నేరవేరిద్దో మనం కూడా వేచి చూడాలి.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus