డిజె టిల్లు టు హిట్2… ఈ ఏడాది బయ్యర్స్ కు లాభాలను అందించిన తెలుగు సినిమాల లిస్ట్..!
December 13, 2022 / 08:00 AM IST
|Follow Us
ఇంకో 3 శుక్రవారాలతో … ఈ 2022 కంప్లీట్ అవుతుంది. ఈ ఏడాది టాలీవుడ్ కు మాత్రమే కోలీవుడ్, బాలీవుడ్ .. ఇలా అన్ని పరిశ్రమలకు ఓ పెద్ద గుణపాఠం నేర్పింది అని చెప్పొచ్చు. 2020 లో లాక్ డౌన్ వల్ల ధియేటర్లు మూతపడ్డాయి. 2021 లో ధియేటర్లు తెరుచుకోవడంతో జనాలు సినిమా బాగుందా … బాలేదా అని చూడకుండా ప్రతి సినిమాని థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయాలని భావించారు. అందుకే అంతంత మాత్రంగా ఉన్న సినిమాలు కూడా ఆ ఏడాది గట్టెక్కేసాయి. కానీ 2022 లో పరిస్థితి మారిపోయింది. టికెట్ రేట్లు పెరిగిపోవడం .. విడుదలైన కొద్దిరోజులకే సినిమాలు ఓటీటీల్లోకి.. అందుబాటులోకి వచ్చేయడం జనాలు ధియేటర్లకు.. రావడం తగ్గించేశారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాల కోసం మాత్రమే జనాలు థియేటర్లకు వస్తున్నారు అని అంతా అనుకుంటున్నారు. కానీ ప్రమోషనల్ కంటెంట్ అనేది ప్రేక్షకులను ఆకర్షిస్తేనే .. థియేటర్లకు వస్తున్నారు అనేది వాస్తవం. ఈ ఏడాది పూర్తిగా జరిగింది ఇదే.అందుకే పెద్ద సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఊహించని విధంగా కొన్ని చిన్న సినిమాలు కూడా లాభాలు మిగిల్చాయి. బయ్యర్స్ కు ఆ లాభాలు మిగిల్చిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) డీజే టిల్లు :
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ రూ.7.57 కోట్ల లాభాలను అందించింది.
2) ఆర్.ఆర్.ఆర్ :
ఎన్టీఆర్ – రాంచరణ్ – రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ రూ.108 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది.
3) మేజర్ :
అడివి శేష్ హీరోగా మహేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ బయ్యర్స్ కు రూ.17.62 కోట్ల లాభాలను అందించింది.
4) బింబిసార :
కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బయ్యర్స్ కు రూ.21.92 కోట్ల లాభాలను అందించింది.
5) సీతా రామం:
దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకుర్ హీరోయిన్ గా రష్మిక మందన కీలక పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ రూ.29.19 కోట్ల లాభాలను అందించింది.
6) కార్తికేయ :
నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రూ.40 కోట్ల లాభాలను అందించింది.
7) మసూద :
ఈ మూవీ మొత్తంగా రూ.4 కోట్ల లాభాలను అందించింది.
8) గాలోడు:
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ఈ మూవీ మొత్తంగా రూ.2.5 కోట్ల వరకు లాభాలను అందించింది.
9) యశోద :
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ కూడా మొత్తంగా రూ.2 కోట్ల వరకు లాభాలను అందించింది.
10) హిట్ 2 :
అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ మొత్తంగా రూ.4 కోట్ల లాభాలను అందించింది.