బాలయ్య పేరు చెప్పగానే ప్లాప్ హీరోయిన్ కూడా భారీగా డిమాండ్ చేస్తుందేంటి?
December 20, 2019 / 11:47 AM IST
|Follow Us
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘రూలర్’ చిత్రం మరో రెండు రోజుల్లో(డిసెంబర్ 20న) విడుదల కాబోతుంది. ఈ చిత్రం పూర్తయిన వెంటనే బోయపాటి శ్రీను డైరెక్షన్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు బాలయ్య. ఇది ఆయనకు 106 వ చిత్రం కావడం విశేషం. ‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవీంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. గతంలో ఈయన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ‘జయ జానకి నాయకా’ వంటి సినిమాలు నిర్మించాడు.
ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్లను ఎంచుకోవడం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా బాలకృష్ణ కు ఈ ప్రాబ్లెమ్ ఎక్కువయ్యింది. ఇప్పటికే అందరి సీనియర్ హీరోయిన్లతో బాలయ్య నటించేసాడు. స్టార్ హీరోయిన్లు బాలయ్య పక్కన నటించడానికి కొంచెం ఆలోచిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో కేథరిన్ ను ఓ హీరోయిన్ గా తీసుకున్నాడు బోయపాటి. అయితే బాలయ్య హీరో అని చెప్పగానే ఆమె కోటి రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తుందట. అయితే నిర్మాతలు కన్విన్స్ చేయగా.. 80 లక్షలకు ఓకే చేసినట్టు తెలుస్తుంది. నిజానికి 80 లక్షలు పారితోషికం తీసుకునేంత క్రేజ్ ఈమెకు లేదు. చెప్పుకోదగ్గ హిట్లు కూడా లేవు. స్టార్ హీరోయిన్లకు లేదా క్రేజ్ ఉన్న హీరోయిన్లకు మాత్రమే అంత అందుతుంది.