రెండేసి పెళ్లిళ్లు చేసుకున్న సినీ తారలు..!

  • March 19, 2019 / 03:33 PM IST

తమ నటనతో ఎంతో పాపులారిటీ సంపాదించడమే కాకుండా… తెరమీద పండించినట్లే నిజజీవితంలోనూ అనుబంధాలు, కుటుంబంలోని అనురాగాలను ఎంతో రసరంజకంగాపండించారు మన తెర వేల్పులు. తెర మీద తాత, తండ్రి, భర్త, కొడుకు, మావయ్య, బావ వంటి పాత్రలు పోషించి… రీయల్ లైఫ్‌లోనూ మమతల మజాను అనుభవించారు. కొందరుక్రమశిక్షణతో ఉండగా.. మరికొందరు స్టార్ డమ్‌తో పాటు ఆకస్మాత్తుగా వచ్చిన డబ్బుతో మితి మీరి ప్రవర్తించారు. అందులో కొన్ని అనివార్యతలుండొచ్చు. మరోవైపు సినిమాల్లోఇద్దరు భామలతో రోమాన్స్ చేసినట్లే… పర్సనల్ లైఫ్‌లోనూ రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మరి అలాంటి సెలబ్రెటీస్ ఎవరో ఒకసారి చూద్దాం.

1)ఎన్టీఆర్: తెలుగు సినిమా తొలి తరం సూపర్‌స్టార్ నందమూరి తారక రామారావు…1942లో మేనమామ కుమార్తె బసవతారకాన్ని వివాహం చేసుకున్నారు. ఆమె క్యాన్సర్‌తోమరణించడంతో ఒంటరైన రామారావు 1993లో లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు.

2)కృష్ణ: తెలుగునాట జేమ్స్‌బాండ్, కౌబాయ్ సినిమాలతో సంచలనం సృష్టించిన సూపర్‌స్టార్ కృష్ణ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1961లో ఇందిరాదేవిని వివాహంచేసుకున్న ఆయన….1969లో తన సహనటి విజయనిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

3)నాగార్జున: అక్కినేని నటవారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన కింగ్ నాగార్జున రోమాంటిక్ కింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1984లో ప్రముఖ నిర్మాత డి.రామానాయుడుకుమార్తె లక్ష్మీని పెళ్లి చేసుకున్న ఆయన ఆ తర్వాతి కాలంలో మనస్పర్థల కారణంగా ఆమెతో విడిపోయారు. అనంతరం తన సహనటి అమలతో ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో 1992లో అమలను రెండో వివాహం చేసుకున్నారు.

4) నందమూరి హరికృష్ణ: రెండు పెళ్లిళ్ల విషయంలో తండ్రి ఎన్టీఆర్‌నే అనుసరించాడు. 1973లో లక్ష్మీని పెళ్లి చేసుకున్నారు.. ఈ దంపతులకు జానకీరామ్, కల్యాణ్ రామ్, సుహసినిజన్మించారు. అనంతర పరిణామాలతో హరికృష్ణ… షాలిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరి సంతానమే జూనియర్ ఎన్టీఆర్.

5)పవన్ కల్యాణ్: మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన పవన్ కల్యాణ్ తనమార్క్ నటనతో తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో అగ్రకథానాయకుడిగాఎదిగారు. 1997లో నందినిని వివాహం చేసుకున్న పవన్ అనంతరం ఆమె నుంచి విడిపోయారు. బద్రి సినిమాలో తన సహనటి రేణు దేశాయ్‌తో ప్రేమలో పడిన పవర్ స్టార్…లాంగ్ డేటింగ్ తర్వాత 2009లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. పరస్పర అంగీకారంతో వీరిద్దరూ తమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. తిరిగి మరోసారి ప్రేమలో పడ్డ పవన్ తీన్‌మార్సినిమాలో నటించిన రష్యన్ నటి అన్నా లెజ్‌నోవాను మూడో వివాహం చేసుకున్నారు.6)శరత్ బాబు: సీనియర్ నటుడు శరత్ బాబు కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1981లో తోటి నటి, కమెడియన్ రమాప్రభను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకువిడాకులు ఇచ్చి… స్నేహా నంబియార్‌ను 1990లో పెళ్లి చేసుకున్నారు. 2011లో స్నేహకు సైతం విడాకులిచ్చిన ఆయన ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు.

7)కమల్ హాసన్: భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో ఒకరైన కమల్ హాసన్ 1978లో ప్రముఖ నాట్య కళాకారిణి వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకువిడాకులిచ్చిన కమల్… 1988లో సారికను రెండో వివాహం చేసుకున్నారు. అనంతరం మనస్పర్థల కారణంగా 2004లో ఆమెకు విడాకులిచ్చారు. ఆ తర్వాత నటి గౌతమితో 13 ఏళ్లుసహజీవనం చేశారు.

8)రాధిక శరత్ కుమార్: ప్రముఖ సినీనటి రాధిక 1985లో ప్రతాప్ పోతన్‌ను పెళ్లి చేసకున్నారు. ఆ తర్వాత ఆయనకు విడాకులిచ్చి…. లండన్‌కు చెందిన రిచర్డ్ హ్యార్లీని రెండోవివాహం చేసుకున్నారు. ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. అనంతరం హీరో శరత్ కుమార్‌తో ప్రేమలో పడి 2001లో పెళ్లి చేసుకున్నారు.

9)ప్రకాశ్ రాజ్: విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్… తొలుత లలితా కుమారిని పెళ్లి చేసుకున్నారు 15 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టి.. 2009లో ఈ జంట విడాకులతోవిడిపోయింది. ఆ తర్వాత 2010లో ప్రముఖ కొరియోగ్రాఫర్ సోనీ వర్మని పెళ్లి చేసుకున్నాడు మోనార్క్.

10)శ్రీజ: చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన ప్రేమ వివాహంతో అప్పట్లో తెలుగునాట సంచలనం సృష్టించారు. భరద్వాజ్‌ను ప్రేమించిన ఆమె స్నేహితుల సమక్షంలో ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్టీకే ఈ జంట విడిపోయింది. తిరిగి చిత్తూరు జిల్లాకు చెందిన కల్యాణ్‌ దేవ్‌ను ఆమె రెండోపెళ్లి చేసుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus