ఈ మధ్య సినిమాల్లో అదరగొట్టిన లేడీ క్యారెక్టర్స్

  • June 12, 2017 / 01:59 PM IST

చిత్ర పరిశ్రమలో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీ మినహా అన్ని సినిమాల్లో తెరపైన ఎక్కువగా హీరో, విలన్లు మాత్రమే కనిపిస్తారు. అలా ఉంటేనే కమర్షియల్ గా హిట్ సాధిస్తుందని దర్శకనిర్మాతల నమ్మకం. ఆ నమ్మకాన్ని కొంతమంది నటీమణులు తమ నటనతో తునాతునకలు చేశారు. హీరోలను సైతం డామినేట్ చేశారు. రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో డామినేట్ చేసిన లేడీ క్యారెక్టర్స్ పై ఫోకస్..

కలర్స్ స్వాతి – అష్టాచెమ్మాకలర్స్ స్వాతి హీరోయిన్ గా అష్టాచెమ్మా లో నటించింది. అలా ఇలా కాదు.. నంది అవార్డు అందుకునేంత ఎనర్జీతో నటించి మెప్పించింది. అందులో హీరోలుగా నటించిన నాని, అవసరాల శ్రీనివాస్ కంటే లావణ్య క్యారక్టర్ పోషించిన స్వాతి రెడ్డి కే ఎక్కువగా పేరు వచ్చింది.

తమన్నా – 100 % లవ్దట్ ఈజ్ మహాలక్ష్మి .. అంటూ తమన్నా 100 % లవ్ సినిమాలో అల్లాడించింది. అందం, అభినయం .. అన్ని విషయాల్లో మిల్కీ బ్యూటీ హీరో నాగచైతన్యను మించి పోయింది. ఈ సినిమాతో తమన్నా కెరీర్ వేగం పుంజుకుంది.

లావణ్య త్రిపాఠి – అందాల రాక్షసియువ దర్శకుడు హను రాఘవపూడి అందాల రాక్షసి సినిమాలో మిథున పాత్రను కొత్తగా మలిచారు. అందులో లావణ్య త్రిపాఠి చక్కగా నటించింది. అందాల రాక్షసి టైటిల్ కి తగినట్లుగా ఆ పేరు చెప్పగానే లావణ్య త్రిపాఠి గుర్తుకు వచ్చేలా కష్టపడి నటనలో వేరియేషన్స్ చూపించింది.

నిత్యామీనన్ – గుండెజారి గల్లంతయిందేకమర్షియల్ సినిమాలో హీరోయిన్స్ కి ఉండాల్సిన క్వాలిటీస్ లేకపోయినా .. ఆమె నటించిన చిత్రాలన్నీ కమర్షియల్ హిట్ సాధించాయి. అందుకు కారణాలు ఆమె ఎంచుకునే కథ, అందులో తన క్యారక్టర్. గుండెజారి గల్లంతయిందే సినిమాలో నిత్యామీనన్ ప్రేమ, పగ చూపించి ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకుంది.

నందిత రాజ్ – ప్రేమ కథ చిత్రం నటనలో ఎక్కువగా అనుభవం లేకపోయినా ప్రేమకథా చిత్రం మూవీలో నందిత రాజ్ అదరగొట్టింది. ముఖ్యంగా దెయ్యం ఆవహించిన సమయంలో ఆమె నటన ఓ వైపు భయాన్ని, మరో వైపు హాస్యాన్ని కలిగించి అలరించింది.

రమ్యకృష్ణ – బాహుబలి బాహుబలి సినిమాకి ముందు రమ్యకృష్ణ అనేలా పవర్ ఫుల్ క్యారెక్టర్స్ చేసింది. అయినా బాహుబలి చిత్రంలో పోషించిన శివగామి పాత్ర తిరుగులేని గుర్తింపును తీసుకొచ్చింది. హీరో, హీరోయిన్, విలన్.. ఇలా ఎంతోమంది ఉన్నప్పటికీ రమ్యకృష్ణ తన నటనతో డామినేట్ చేసింది.

హెబ్బా పటేల్ – కుమారి 21 ఎఫ్హెబ్బా పటేల్ ఒకే సినిమాతో యువతను పడగొట్టేసింది. కుమారి 21 ఎఫ్ లో కుమారిగా బోల్డ్ గా నటించి, మెప్పించింది. చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద సక్సస్ సాధించడానికి కారణం హెబ్బా పటేల్ నటనే.

సమంత – అ..ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో హీరో క్యారక్టర్ ఓ రేంజ్ లో ఉంటుంది. తొలిసారి ఈ డైరక్టర్ అ..ఆ మూవీలో హీరోయిన్ కి ప్రాధాన్యత ఇచ్చారు. సమంత తన అనుభవాన్ని మొత్తం రంగరించి అనసూయ పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ – రారండోయ్ వేడుక చూద్దాం గ్లామర్ డాల్ పాత్రలు అనేకం చేసిన రకుల్ ప్రీత్ సింగ్ కి చాలాకాలానికి మంచి రోల్ దొరికింది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో భ్రమరాంబ పాత్రలో జీవించేసింది. ఈ రోల్ తో రకుల్ ఎక్కువ అభిమానులను సంపాదించుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus