Tollywood: టాలీవుడ్‌ డ్రగ్స్‌ ‘కొట్టేసిన’ న్యాయ స్థానం… ఏం జరిగిందంటే?

  • February 2, 2024 / 01:42 PM IST

గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌ను కలవరపెడుతున్న డ్రగ్స్‌లో కేసు కీలక మలుపు తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. 2017లో నమోదైన కేసులను విచారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులపై సుదీర్ఘ విచారణ, పరీక్షలు, చర్చలు తర్వాత ఇప్పుడు కోర్టు ఆరు కేసులను కొట్టివేసింది. అయితే మరో రెండు కేసులు మాత్రం ఉన్నాయి.

డ్రగ్స్‌ వ్యవహారంలో సిట్‌ మొత్తం 12 కేసులు నమోదు చేయగా ఎనిమిది కేసుల్లో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. వాటిలో ఆరు కేసులకు సంబంధించి సరైన ఆధారాలు లేవని చెబుతూ కోర్టు కొట్టివేసింది. డ్రగ్స్‌ కేసు విషయంలో ప్రొసీజర్‌ను ఫాలో కాలేదని వ్యాఖ్యానించిన న్యాయస్థానం… ఆరు కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవని స్పష్టం చేసింది. దీంతో ఆ ఆరు కేసులను కొట్టివేసింది.

ఇక ఈ కేసులకు సంబంధించి నెలల తరబడి టాలీవుడ్‌ (Tollywood) నటులను ఎక్సైజ్‌ అధికారులు విచారించారు. మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆఫీసుకు పిలిపించుకుని మరీ గంటల తరబడి విచారణ జరిపారు. కేసుల విషయంలో అనుమానం ఉన్న నటీనటుల దగ్గర నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలు తీసుకుని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. వాటిలో పూరి జగన్నాథ్‌, తరుణ్‌ శాంపిల్స్‌ను మాత్రమే పరిశీలించిన ఎఫ్‌ఎస్‌ఎల్‌ వారి శరీరంలో ఎలాంటి డ్రగ్స్‌ ఆనవాళ్లు లేవని చెప్పింది.

ఈ నివేదిక ఆధారంగా సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం ఆరు కేసులను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. హైద‌ర‌బాద్‌లో ఆ సమయంలో డ్ర‌గ్స్ సప్లయిర్స్‌ ప‌ట్టుబ‌డ‌టం, వారికి సినిమా జనాలతో సంబంధాలు ఉన్నాయ‌నే లింకులు దొరికాయ‌ంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత దర్శకుడు పూరి జ‌గ‌న్నాథ్‌, న‌టులు త‌రుణ్, ర‌వితేజ‌, త‌నీష్, చార్మి, ముమైత్ ఖాన్ త‌దిత‌రులను సిట్ విచారించింది. అయితే ఇప్పుడు సంబంధం లేదు అని తేలడంతో కేసు మలుపు తిరిగింది. మిగిలిన రెండు ఛార్జిషీట్ల సంగతి తేలాల్సి ఉంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus