న్యూస్ చానల్స్ పై ఇండస్ట్రీ తీసుకొన్న కీలక నిర్ణయం
April 25, 2018 / 12:20 PM IST
|Follow Us
న్యూస్ చానల్స్ మీద ఇండస్ట్రీ ఆధారపడి బ్రతుకుతుందా లేక ఇండస్ట్రీ మీద న్యూస్ చానల్స్ ఆధారపడి బ్రతుకుతున్నాయా అనే అంశం మీద వందల డిబేట్లు జరిగినా ఇప్పటివరకూ ఒక్కసారి కూడా క్లారిటీ రాలేదు. అయితే.. ఈమధ్యకాలంలో టీ.ఆర్.పి రేటింగ్స్ కోసం కొన్ని చానల్స్ చిత్ర పరిశ్రమను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ కొన్ని అసహ్యకరమైన డిబేట్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ రన్ చేసింది. ఈ విషయమై ఇండస్ట్రీ చాలా సీరియస్ అయ్యింది. ముఖ్యంగా టీవి5 సంస్థ ప్రతినిధి ఇండస్ట్రీలో మహిళలను తక్కువ చేసి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మహా న్యూస్, టీవి9 చేసిన రచ్చకీ స్వయానా పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ తో సహా మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది. “టీవి5, టీవి9, మహా” చానల్స్ ను బ్యాన్ చేయాలని, సదరు చానల్స్ కి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ఫీడ్ లేదా ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది మానేయాలని తీర్మానించుకొందని తెలుస్తోంది.
అయితే.. ఇది పవన్ కళ్యాణ్ లేదా మెగా ఫ్యామిలీ మాత్రమే తీసుకుంటే అమలయ్యే నిర్ణయం కాదు. అందుకే ఇండస్ట్రీలోని అగ్ర కథానాయకులు మొదలుకొని యువ హీరోలందరూ ఏకమయ్యారు. నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి,మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్,అల్లు అరవింద్, నాగ బాబు,నాని,ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మొదలుకొని ఇండస్ట్రీలోని హీరోలందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలోనే ఈ మీటింగ్ లో తీసుకొన్న నిర్ణయాలను ప్రకటించనున్నారు.