వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
November 8, 2019 / 01:05 PM IST
|Follow Us
40 సంవత్సరాలు దాటిన హీరోలు కూడా సినిమా రూల్స్ ప్రకారం యంగ్ క్యారెక్టర్లు చేయడం న్యాయమే… అయితే యంగ్ హీరో ఓల్డ్ క్యారెక్టర్ చేయడమంటే సాహసమనే చెప్పాలి. అందులోనూ క్రేజ్ లో ఉన్న హీరోలు ఇలాంటి పాత్ర వేయడమంటే మరింత వింతగానే చెప్పుకోవాలి. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ వంటి స్టార్ హీరోలు ఓల్డ్ గెటప్స్ లో కనిపించారు. అయితే తరువాత మాత్రం కొంతమంది హీరోలే ఇలా ఓల్డ్ గెటప్స్ లో కనిపించారు. అయితే ఆ హీరోలు చేసింది ఎక్కువ డ్యూయల్ రోల్స్.. మరికొంతమంది యంగ్ హీరోలు కూడా ఇలా ఓల్డ్ గెటప్స్ లో కనిపించారు. వాళ్ళెవరో ఓ లుక్కేద్దాం రండి :
1)చిరంజీవి – స్నేహం కోసం
ఈ చిత్రంలో మెగాస్టార్ యాక్టింగ్ అదుర్స్ అనే చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ లో కూడా మెగాస్టార్ జీవించేసారు.
2)బాలకృష్ణ – పెద్దన్నయ్య, చెన్నకేశవరెడ్డి
ఈ రెండు చిత్రాల్లోనూ బాలయ్య పవర్ ఫుల్ పత్రాలు పోషించారు. రెండు చిత్రాల్లోనూ ఓల్డ్ గెటప్ పాత్రే హైలెట్ కావడం మరో విశేషం.
3) విక్టరీ వెంకటేష్ – సూర్యవంశం
ఈ చిత్రంలో హరిశ్చంద్ర ప్రసాద్ పాత్రలో వెంకటేష్ జీవించారనే చెప్పాలి. అలాగే సినిమా కూడా సూపర్ హిట్టయ్యింది.
4) మోహన్ బాబు : పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి
ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ కాస్త డైలాగ్ కింగ్ అవతారమెత్తాడు. మోహన్ బాబు ఇది ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం. ‘రాయలసీమ రామన్న చౌదరి’ చిత్రంలో కూడా మోహన్ బాబు ఓల్డ్ గెటప్ హైలెట్ అనే చెప్పాలి. సినిమా పెద్దగా ఆడకపోయినా ఆ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా నటించి మెప్పించారు మోహన్ బాబు.
5) రజినీకాంత్ : పెదరాయుడు, ముత్తు, నరసింహ
ఈ మూడు చిత్రాల్లోనూ మన సూపర్ స్టార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలా… అద్భుతం అంతే..!
6) కమల్ హాసన్ : భారతీయుడు
ఈ యూనివెర్సల్ హీరో ఎన్నో గుర్తుంది పోయే పాత్రలు పోషించినా.. మనకి ఎప్పుడూ గుర్తుంది పోయే పాత్ర మాత్రం ‘భారతీయుడు’ చిత్రంలోని సేనాపతి క్యారెక్టర్ మాత్రమే అనడంలో సందేహం లేదు.
7)రాజశేఖర్ – మా అన్నయ్య
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన ఈ చిత్రంలో ఆయన నటనకి ప్రతీ ఒక్కరూ చప్పట్లు కొట్టాల్సిందే. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో కూడా కంటతడి పెట్టించారాయన.
8) నాగార్జున : అన్నమయ్య
మన టాలీవుడ్ హీరోల్లో స్పెషల్ జ్యూరీ కేటగిరిలో నేషనల్ అవార్డు గెలుచుకున్న ఏకైక హీరో మన ‘కింగ్’ నాగార్జున అనే చెప్పాలి. ‘అన్నమయ్య’ చిత్రంలో ఆయన నటనకి గానూ ఈ అవార్డు వచ్చింది. నిజంగా ‘అన్నమయ్య’ అంటే ఇలాగే ఉంటాడేమో అనేంతలా నటించారాయన. ముఖ్యంగా ఆ ఓల్డ్ గెటప్ లో అయన నటన అద్భుతం అనడంలో అతిశయోక్తి లేదు..!
9)మహేష్ బాబు – నాని
ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ అయిన మహేష్ బాబు కూడా ‘నాని’ చిత్రం క్లయిమాక్స్ లో ఓల్డ్ గెటప్ లో కనిపించాడు మహేష్.
10) రానా – బాహుబలి, బాహుబలి 2
‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో.. రానా కూడా అదే రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ‘బాహుబలి ది బిగినింగ్’ లో ఓల్డ్ క్యారెక్టర్ చేసిన రానా శభాష్ అనిపించుకున్నాడు.
11) సుధీర్ బాబు : వీర భోగ వసంత రాయలు
ఈ చిత్రంలో కాసేపు ఓల్డ్ గెటప్ లో కనిపించి సర్ ప్రైజ్ చేసాడు సుధీర్ బాబు.
12) నారా రోహిత్ : అప్పట్లో ఒకడుండేవాడు
ఈ చిత్రం క్లయిమాక్స్ లో కాసేపు ఓల్డ్ గెటప్ లో కనిపించాడు నారా రోహిత్.
13) శ్రీవిష్ణు : అప్పట్లో ఒకడుండేవాడు
రోహిత్ తో పాటూ శ్రీవిష్ణు కూడా ఈ చిత్రంలో ఓల్డ్ గెటప్ లో కనిపించాడు.
14) సుమంత్ : ఎన్టీఆర్ కథానాయకుడు
ఈ చిత్రంలో తన తాతగారి పాత్రలో ఓల్డ్ గెటప్ లో కనిపించి ప్రశంసలు అందుకున్నాడు సుమంత్.
15) తొట్టెంపూడి వేణు : కల్యాణ రాముడు
జి.రాంప్రసాద్ డైరెక్షన్లో వేణు హీరోగా నటించిన ‘కళ్యాణరాముడు’ చిత్రంలో ఓల్డ్ గెటప్ లో కనిపించాడు వేణు. ఈ సినిమా సూపర్ హిట్ కావడం విశేషం.