ఫ్యాషన్షూట్ కై శ్రీలంక తరలిన దక్షిణ భారత నటీమణులు, ప్రముఖులు.
April 4, 2022 / 01:01 PM IST
|Follow Us
దేశ పర్యాటక పునరుద్ధరణకు మద్దతును ఇవ్వడానికి నిరంతరంప్రయత్నిస్తూ, దానికి అతిపెద్ద మార్కెట్ అయిన భారతదేశంతో బంధాన్ని పటిష్టం చేస్తూ,శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ భారతదేశంలోని ప్రముఖ నటీనటులు మరియు ప్రముఖ వ్యక్తులకుఆతిథ్యాన్ని అందించింది. ప్రముఖ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్,యూట్యూబర్స్ తో కూడిన, ముఖ్యంగా దక్షిణ భారతదేశ నగరాలకి చెందిన ఈ బృందం శనివారం, మార్చ్26న కొలంబో చేరుకున్నారు.లగ్జరీ, ఆతిథ్యం తమ శాశ్వత లక్షణాలుగా అలవర్చుకున్నశ్రీలంక యొక్క పర్యావరణ, సాంస్కృతిక చైతన్యంకలిగి ఉన్న అక్కడి ప్రయాణంలో ఈ బృందం ఆరు రోజుల పాటు ప్రయాణించింది.
తమ ట్యాలెంట్ తో, తమ ట్రావెల్ వీడియోస్ ద్వారాదేశవ్యాప్తంగా లక్షల్లో అభిమానుల్ని సొంతం చేసుకున్న అవిక గోర్ (చిన్నారిపెళ్ళికూతురు సీరియల్ ఫేం), గెహ్న హరేష్ సిప్పీ (టాలివుడ్ నటి చోర్ బజార్ సినిమాఫేం), అపూర్వ శ్రీనివాసన్ (నటీ, మై సౌత్ దివా వ్లాగర్), రుహాని శర్మ (టాలివుడ్నటి), తాన్యా హోప్ (తెలుగు, తమిళ్, కన్నడ భాషల నటీ) మరియు మనోజ్ కుమార్ కాటోకర్ (ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్, మైసౌత్ దివా వ్యవస్థాపకుడు) ఈ బృందంలో సభ్యులు.
ట్రిప్మొత్తం సిన్నమోన్ బెంటోటా బీచ్ లో ఉండి, అక్కడి నుండి దగ్గరలోని చూడతగినప్రదేశాలకు ఈ బృందం వెళ్తుంది. అలానే దగ్గరలోని రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగిన‘ట్రీ-ప్లాంటేషన్’ ప్రోగ్రాంని సందర్శించారు. శ్రీలంక యొక్క ప్రముఖ DMC (డెస్టినేషన్మేనేజ్మెంట్ కంపెనీ), వాకర్స్ టూర్స్ వీటిని నిర్వహించాయి.అక్కడిప్రాపర్టీస్ లోనే ఈ బృందంతో, మై సౌత్ దివా తమ తదుపరి వార్షిక క్యాలెండర్ ను చేసేందుకురంగం సిద్ధం చేసుకుంది. మొత్తంగా ఈ బృందం నిర్వహించిన ఈ ట్రిప్ విజయవంతం అయ్యింది.